Visakhapatnam : వేసవి సెలవులు మొదలు కానున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు ఇక బ్రేక్ పడనుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ పరీక్షల మూడ్ నుంచి ఎంజాయ్ మూడ్‌లోకి వచ్చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఎటు వెళ్లాలనే దానిపై ఇప్పటికే చాలా మంది టూర్లు కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తే.. మరికొంతమంది విహారయాత్రలు, వినోద యాత్రలు ప్లాన్ చేస్తుంటారు. దీంతో వేసవి సెలవుల్లో రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇప్పటికే తిరుపతికి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పుడు విశాఖపట్నానికి 42 ప్రత్యేక రైళ్లు నడపనుంది.

ప్రయాణికుల రద్దీని దృష్టి ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమైంది. విశాఖపట్నం-బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-కర్నూలు మధ్య మొత్తం 42 ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వీక్లీ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 08581 నంబర్‌తో విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రత్యేకరైలు బెంగళూరుకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు 12 గంటల 45 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది.
Read Also : జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు ఆదా : వెంకయ్య నాయుడు