Election expenses will be saved with Jamili elections.. Venkaiah Naidu

Venkaiah Naidu : జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు ఆదా : వెంకయ్య నాయుడు

Venkaiah Naidu : తిరుపతిలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని అన్నారు. సాంకేతికత సాయంతో జమిలి ఎన్నికలు జరపడం కష్టం కాదని చెప్పారు. కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు.

Advertisements
జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు

అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి

జమిలి ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, సంయమనం కోల్పోతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు. వారు ఎవరో మీకే తెలుసు అంటూ వెంకయ్య నాయుడు సెటైర్లు వేశారు.

భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది

అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని అన్నారు. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందుతునరాని అన్నారు. నువ్వే నా.. మేం అంతే అంటూ మరికొద్దిమంది భూతులు మాట్లాడుతున్నార‌ని వాపోయారు. పోలింగ్ భూత్‌లోకి వెళ్లి ఓటు వేసి ఓడించార‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు.

Read Also: త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ?

Related Posts
అట్టహాసంగా వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుక
CBN VNGS

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా గుంటూరులోని శ్రీ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అతిధిగా హాజరై, Read more

Amazon Future Engineer: ఏపీ స్కూల్ విద్యార్థులకు కోడింగ్ శిక్షణ
Amazon Future Engineer: ఏపీ స్కూల్ విద్యార్థులకు కోడింగ్ శిక్షణ

ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య విస్తరణ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేపట్టిన సామాజిక బాధ్యత ప్రాజెక్ట్ ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్‌ (AEF)’ ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలైంది. విశాఖపట్నం, Read more

AP Liquor: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ షాపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Liquor: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ షాపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో పర్మిట్ రూమ్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్? — ప్రభుత్వం కీలక ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణలో కీలక మార్పులు చేయడానికి యోచిస్తున్నదిగా సమాచారం. ముఖ్యంగా Read more

జనసేనలోకి మాజీ MLA ?
జనసేనలోకి మాజీ MLA ?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడిమి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆయన కుటుంబ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×