ఆఫ్రికా దేశం సుడాన్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దాడులతో అతలాకుతలమౌతోంది. డార్ఫర్ ప్రాంతంలో రెండు రోజులపాటు జరిగిన దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ వెల్లడించింది.
జామ్జామ్, అబూషాక్ క్యాంపులపై దాడులు
గత శుక్ర, శనివారం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు డార్ఫర్ ప్రాంతంలోని జామ్జామ్, అబూషాక్ క్యాంపులపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించినట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ పేర్కొంది. మృతుల్లో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్‌కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది.

దాడులను ఖండించిన యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్
వాళ్లంతా జామ్జామ్ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో తమ విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ దాడులను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముంగిచి పౌరులకు, మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.కాగా, జామ్జామ్ క్యాంపుపై ఆర్‌ఎస్‌ఎఫ్ దాడులు కారణంగా గత రెండు రోజుల్లో 60 నుంచి 80 వేల కుటుంబాలను నిరాశ్రయులు అయ్యరని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ తాజాగా వెల్లడించిండి. ఇక 16 వేల మంది పౌరులు జామ్జామ్ శిబిరాన్ని వీడినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల కిందట మొదలైంది
సుడాన్ అంతర్యుద్దం రెండేళ్ల కిందట మొదలైంది. 2023 ఏప్రిల్ 15న సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్- ఆర్‌ఎస్‌ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి. సుడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్- ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ రెండు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను ‘తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన’ అని ఐక్యరాజ్య సమితి అప్పట్లోనే పేర్కొంది. ఈ ఘర్షణల వల్ల దాదాపు కోటి 30 లక్షల మంది సుడాన్‌కు వదిలి పొరుగు దేశాలకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.
Read Also: బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం – ట్రంప్