బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు

China: బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు

మయన్మార్, థాయ్ లాండ్ లను ఇటీవల పెను భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. చుట్టుపక్కల భవనాలకు పెద్దగా నష్టం వాటిల్లకపోయినా ఈ భనవం మాత్రం శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఈ భారీ టవర్ ను చైనా కంపెనీ నిర్మిస్తోంది. సదరు కంపెనీలో చైనా రైల్వే గ్రూప్ కు వాటా ఉండడం గమనార్హం. కాగా, బిల్డింగ్ కూలిన ప్రాంతం నుంచి డాక్యుమెంట్లు తీసుకెళుతున్న నలుగురు చైనా పౌరులను బ్యాంకాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు తీసుకెళుతున్నామని వారు చెబుతున్నారని తెలిపారు.

Advertisements
బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు

డాక్యుమెంట్ల తరలింపుపై పలు సందేహాలు
అయితే, కూలిన బిల్డింగ్ ను నిర్మించింది చైనా కంపెనీ కావడంతో ఈ డాక్యుమెంట్ల తరలింపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, భారీ భవనం కూలిన ఘటనపై థాయ్ లాండ్ ప్రధాని షినవత్ర స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రధాని ఆదేశాల మేరకు కూలిన శిథిలాల నుంచి స్టీల్ సేకరించి పరీక్షలు జరపగా.. బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించిన స్టీలు నాసిరకమైనదని తేలినట్లు అధికారులు వివరించారు. భూకంపం ధాటికి బిల్డింగ్ కుప్పకూలడానికి ఈ నాసిరకం స్టీలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్ ప్లాన్ లోనూ పలు లోపాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
కొనసాగుతున్న లోతైన దర్యాప్తు
ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపి అసలు కారణం తెలుసుకుంటామని థాయ్ లాండ్ అంతర్గత వ్యవహారాల మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ పేర్కొన్నారు. భవనం కూలిపోయిన సమయంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన 19 మంది మరణించారని, మరో 75 మంది ఆచూకీ తెలియడంలేదని బ్యాంకాక్ గవర్నర్ మీడియాకు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Related Posts
జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడిలో 7 భారతీయులు గాయపడ్డారు..
german christmas market attack

జర్మనీకి చెందిన మాగ్డెబర్గ్‌లో జరిగిన క్రిస్మస్ మార్కెట్ దాడిలో 7 భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన తర్వాత, మూడు భారతీయులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. Read more

హోరా హోరీగా అమెరికా ఎన్నికల ఫలితాలు..ట్రంప్‌ 247..హారిస్‌ 214
US Election Result 2024. Donald Trump Inches Towards Victory Is Republicans Win Senate Majority

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం హోరా హోరీగా మారుతున్నాయి. కౌంటింగ్ జరిగే కొద్దీ ట్రెండ్స్ మారిపోతున్నాయి. మొదటి నుంచి ఆధిక్యతలో ఉన్న ట్రంప్ కు హరీస్ Read more

గాజాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
గాజాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ Read more

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఆరుగురి మృతి?
Another plane crash in America.. Six dead?

ఫిలడెల్ఫియా: అమెరికాలో మరో విమాన ప్రమాదం సంభవించింది. ఇటీవల భారీ విమాన ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఓ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *