MLA ఫొటోలతో యువతులకు బురిడీ కొట్టాడు ఓ యువకుడు. MLA ఫొటోలను ప్రొఫైల్ ఫొటోగా వాడుకుని ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి ఘరానా మోసం చేశాడు. అంతేకాక వారి వద్ద రూ. కోట్ల డబ్బును దండుకున్నాడు. అయితే నిందితుడ్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆ నిందితుడి లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
మ్యాట్రీమోనియల్వెబ్సైట్స్ లో ఘరానా మోసం
మ్యాట్రీమోనియల్వెబ్సైట్స్ లో పెళ్లి పేరుతో యువకుడి ఘరానా మోసం బయటపడింది. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్వెబ్సైట్స్ అడ్డంపెట్టుకుని ఏకంగా 26 మంది యువతులను మోసం చేశాడు. వారి వద్ద నుంచి రూ.కోట్ల డబ్బుతో ఉడాయించాడు. అతడిని జూబ్లీహిల్స్పోలీసులు పట్టుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రైవేటు వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు
ఏపీలోని రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ Shaadi.com ద్వారా తనకు పరిచయం అయి.. తన పెళ్లి పేరుతో మోసం చేసాడని ఓ ప్రైవేటు వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. అయితే విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వంశీకృష్ణ తన ప్రొఫైల్ ఫోటోగా యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫొటోను వాడి యువతులను నమ్మించి మోసం చేసినట్లు తేలింది. 4 రాష్ట్రాల్లో 26 మంది యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడని గుర్తించారు.
READ ALSO: Rape: మైనర్ బాలికపై హత్యాచారం