ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట 18 మంది మృతి

ఫిబ్రవరి 15 రాత్రి 9:55 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభ్ కు రైలు ఎక్కేందుకు ప్రయాణికులలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం వివరాలను పరిశోధించడానికి, రైల్వే మంత్రిత్వ శాఖ ఇద్దరు సీనియర్ రైల్వే అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇది మొత్తం ప్రమాదం వివరాలను పరిశీలిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం, ఎలాంటి పొరపాట్లు జరిగాయో పరిశీలిస్తున్నారు.
ప్లాట్‌ఫామ్‌ మార్చడమే తొక్కిసలాటకు కారణం
ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాటపై RPF నివేదిక ఇచ్చింది. ప్లాట్‌ఫామ్‌ మార్చడమే తొక్కిసలాటకు కారణం ఆర్‌పీఎఫ్‌ స్పష్టం చేసింది. 12వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి శివగంగ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లగానే.. అక్కడికి ప్రయాణికులు పోటెత్తారని తెలిపింది.12, 13, 14, 15,16 ప్లాట్‌ఫామ్‌లు రద్దీగా మారాయి. గంటకు 1500 టికెట్ల విక్రయాన్ని ఆపాలని కోరినట్లు ఆర్‌పీఎఫ్‌ తెలిపింది. స్పెయిల్‌ ట్రెయిన్‌ 12వ ప్లాట్‌ఫామ్‌కు వస్తుందని చెప్పారు..మళ్లీ 16వ నెంబర్‌కు వస్తుందంటూ ప్రకటన చేశారని తన నివేదికలో తెలిపింది. 2,3 నెంబర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపైకి వెళ్లడానికి..ప్రయాణికులు మెట్లు ఎక్కుతుండగా తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంది.

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట


దర్యాప్తులో సంచలన విషయాలు
శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. తీవ్రగాయాల పాలైన 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో రైల్వేశాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై తప్పుడు అనౌన్స్‌మెంట్‌ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చివరి నిముషంలో ప్లాట్‌ఫామ్‌ మార్చడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
విచారణకు ఆదేశం
అంతేకాకుండా ఒకే పేరుతో రెండు రైళ్లు ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వాళ్లను కంట్రోల్‌ చేయడంలో RPF సిబ్బంది విఫలమయ్యారు. వాస్తవానికి ఎక్కువమంది RPF సిబ్బందిని కుంభమేళాకు తరలించడంతో చాలా తక్కువమంది సిబ్బంది ఢిల్లీ స్టేషన్‌లో ఉన్నారు. తొక్కిసలాటపై ఇద్దరు సభ్యుల విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఆర్‌పీఎఫ్‌ నివేదికను సమర్పించింది.

Related Posts
ప్రతి సవాలు మన ధైర్యాన్ని పెంచుతుంది – గౌతమ్ అదానీ
adani 1

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నేడు, అమెరికా ప్రభుత్వ దర్యాప్తును ఎదుర్కొన్న విషయం పై స్పందించారు. ఈ వివాదం ఆ సంస్థకు కొత్తది కాదని ఆయన Read more

నకిలీ పాన్‌కార్డు ఉంటే రూ.10,000 వరకు జరిమానా
నకిలీ పాన్‌కార్డు ఉంటే రూ.10,000 వరకు జరిమానా

ప్రభుత్వం అధునాతన ఇ-గవర్నెన్స్ చొరవల ద్వారా పర్మనెంట్ అకౌంట్ నంబర్ పాన్‌తో అనుబంధించబడిన అన్ని సేవలను మెరుగుపరుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం పాన్‌2.0ని ప్రవేశపెట్టింది. ఇది నకిలీ Read more

ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందే: సుప్రీంకోర్టు
Amaravati capital case postponed to December says supreme court jpg

Supreme Court న్యూఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ Read more

ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది, ఇది విపరీతంగా అందరినీ షాక్‌కి గురిచేసింది. ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు వ్యక్తులు అత్యంత కఠినమైన, పాశవికంగా హత్యకు గురయ్యారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *