క్రిప్టోకరెన్సీ మరోసారి వార్తల్లోకెక్కింది. గూగుల్ , ఆపిల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు అనుమానాస్పదమైన క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లను తమ స్టోర్ల నుండి తొలగిస్తున్నాయి. ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ 17 క్రిప్టో ట్రేడింగ్ యాప్‌లను తొలగించింది. దక్షిణ కొరియా ఆర్థిక సేవల కమిషన్ (ఎఫ్ ఎస్ సి ) వెల్లడించిన వివరాల ప్రకారం, కొన్ని క్రిప్టో యాప్‌లు చట్టపరమైన లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నాయి, దీని వల్ల పెట్టుబడిదారులకు ఆర్థిక నష్టాలు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి.
నిషేధించబడిన క్రిప్టో యాప్‌లు
తాజాగా గూగుల్ , ఆపిల్ తమ యాప్ స్టోర్లలో నుండి తొలగించిన కొన్ని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు: తాజాగా గూగుల్ , ఆపిల్ తమ యాప్ స్టోర్లలో నుండి తొలగించిన కొన్ని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు:కుకాయిన్ , ఎంఇ ఎక్స్ సి ,ఫేమిక్స్,బిట్ ట్రూ ,బిట్ గ్లోబల్ , ,కాయిన్ ఎక్స్ .ఇవి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పనిచేస్తున్నట్లు ఎఫ్ఎస్ సి గుర్తించింది. ఈ యాప్‌లను ఉపయోగించిన అనేక మంది పెట్టుబడిదారులు భారీగా నష్టపోయినట్లు సమాచారం.
మనీలాండరింగ్ భయం
ఈ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచడంలో విఫలమయ్యాయి.డేటా లీక్‌లు జరిగే అవకాశం ఉందని ఎఫ్ఎస్ సిహెచ్చరించింది.పెట్టుబడులను దుర్వినియోగం చేసే అవకాశాలు పెరిగాయి.క్రిప్టో లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ జరుగుతున్నట్లు ఎఫ్ఎస్ సి గుర్తించింది.దీంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

ఆపిల్ కూడా చర్యలు
ఆపిల్ అప్ స్టోర్ నుంచి ఈ నిషేధిత యాప్‌లను తొలగించేందుకు సిద్ధమైంది.దక్షిణ కొరియా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ ఐ యూ ), కొరియా కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ కమిషన్ ఈ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
భారీ జరిమానా
చట్టవ్యతిరేకంగా క్రిప్టో వ్యాపారం నిర్వహించే వారికి దక్షిణ కొరియా ప్రభుత్వం 50 మిలియన్ కొరియన్ వోన్ (రూ. 29 లక్షలు) జరిమానా విధించనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.ఈ చర్యలు ఇతర దేశాలకు కూడా ప్రేరణగా మారవచ్చు.
భారతదేశంలో కూడా
భారతదేశంలో కూడా క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లపై నిఘా పెంచి, కొన్ని యాప్‌లను నిషేధించింది.భారతదేశంలో నిషేధించబడిన క్రిప్టో యాప్‌లు,బినాన్స్,కుకాయిన్,హుఓబి,క్రాకెన్,గేట్.ఇఓ,బిటిస్టంప్,ఎంఇ ఎక్స్ సి గ్లోబల్,బిట్టర్స్,బిటిఫిన్స్,ఈ క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లు లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించిన తర్వాత, భారత ప్రభుత్వం ఇవి గూగుల్ ప్లే స్టోర్ , ఆపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో లేకుండా చేసింది.క్రిప్టో యాప్‌లు ఉపయోగిస్తున్న వారంతా జాగ్రత్త!గూగుల్ , ఆపిల్ అనుమానాస్పదమైన క్రిప్టో ట్రేడింగ్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.చట్టపరమైన అనుమతులు లేని యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం రిస్క్.భద్రతా సమస్యలు, డేటా లీక్‌లు, మనీలాండరింగ్ భయాలు పెరుగుతున్నాయి.కాబట్టి, క్రిప్టోలో పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా పరిశీలించాలి.