हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

16th Finance Commission : ఏపీలో 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటన..

sumalatha chinthakayala
16th Finance Commission : ఏపీలో 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటన..

16th Finance Commission : రాష్ట్రానికి వచ్చిన పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం నుంచి ఏపీ లో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ , ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఫైనాన్స్ కమిషన్ బృందం రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనుంది. విజయవాడ , తిరుపతి నగరాల్లో పర్యటించనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఫైనాన్స్ కమిషన్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ కానున్నారు.

ఏపీలో 16వ ఆర్థిక సంఘం

ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం

బుధవారం ఉదయం 10:30 గంటల నుండి 11:00 గంటల వరకు సచివాలయంలోని మొదటి బ్లాకులో అమరావతి ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్‌ను ఫైనాన్స్ కమిషన్ బృందం తిలకించనుంది. 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మొదటి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు. సాయంత్రం మూడున్నరకు నోవాటెల్ హోటల్లో ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహిస్తారు.

స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం

అనంతరం రాత్రి ఏడు గంటలకు విజయవాడలోని బెర్మ్ పార్కులో ముఖ్యమంత్రి ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు. రాత్రి పది గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరి వెళతారు. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం అవుతారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవర్గాలతో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి ఈ నెల 18వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది. కాగా రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటా శాతాన్ని పెంచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసే అవకాశం ఉంది.

Read Also: పార్కింగ్ ఫీజుల దోపిడీకి చెక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870