శరవేగంగా అమరావతి హైవే పనులు

శరవేగంగా అమరావతి హైవే పనులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేషనల్ హైవేల ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా జాతీయ రహదారి నిర్మాణ పనులు పురోగమిస్తుండగా, విశాఖపట్నం జిల్లాలో అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న కీలకమైన నేషనల్ హైవే విస్తరణకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పెందుర్తి-బొడ్డవర 516బి జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.782.91 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు.

Advertisements

నేషనల్ హైవే

నేషనల్ హైవే విస్తరణలో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె వరకు 78.95 కిలోమీటర్ల మేర సాగుతోంది. నేషనల్ హైవే 440లో విస్తరణ పనుల కోసం గత డిసెంబరులో రూ.1059 కోట్లతో టెండర్ ప్రక్రియ ముగియగా, భూసేకరణ పూర్తయింది. ఈ నెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం నుండి వర్చువల్ విధానంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

రహదారుల పనులు

అమరావతికి కనెక్ట్ అయ్యే రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయి. గత నెల 27న ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారు కాగా, పనులు త్వరలో ప్రారంభమవనున్నాయి. ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ చేసే రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వం నడికుడి, మాచర్ల, మార్కాపురం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ హైవేకు 167ఏడిగా నామకరణం చేశారు. ఈ విస్తరణలో భాగంగా మాచర్ల బైపాస్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

శరవేగంగా అమరావతి హైవే పనులు

బ్రిడ్జిలు

మాచర్ల బైపాస్‌లో మొత్తం మూడు బ్రిడ్జిలు నిర్మించగా, ఒకటి సాగర్ రహదారి మీదుగా, మరొకటి చంద్రవంక వాగుపైన, మూడవది ఎన్టీఆర్ నగర్ కాలనీలో రైల్వే బ్రిడ్జిగా ఉండనుంది. రైల్వే గేటు మూసివేసినప్పుడు స్థానికులు అనేక ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో 167ఏడి విస్తరణలో భాగంగా రైల్వే బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.రైల్వే బ్రిడ్జి పూర్తయిన తర్వాత రాయవరం జంక్షన్ నుండి బైపాస్ మీదుగా మార్కాపురం, సాగర్ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. మాచర్ల పట్టణంలోకి ప్రవేశించకుండా ప్రయాణీకులు సులభంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. నేషనల్ హైవే విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ మెరుగవడంతో పాటు వాణిజ్య, రవాణా సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి.

Related Posts
ఢిల్లీ బొమ్మలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే
ఢిల్లీ బొమ్మలపై .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. ఈ శకటంలో ఏటికొప్పాక బొమ్మలు ఉన్న విషయం డిప్యూటీ సీఎం Read more

పవన్ భద్రతపై విచారణ చేస్తున్నాము : డీజీపీ
dgp ap

డిప్యూటీ సీఎం పవన్ భద్రత అంశాన్ని సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా Read more

ఓ తల్లిగా తనకు ఇద్దరు బిడ్డలూ సమానమేనన్న విజయమ్మ?
YSRFAMILY

వైఎస్ జగన్ మరియు షర్మిల మధ్య ఆస్తుల వివాదం తీవ్రంగా మారిన సమయంలో, వారి తల్లి వైఎస్ విజయమ్మ తన మనసులోని బాధను బహిరంగ లేఖ ద్వారా Read more

Pawan Kalyan : ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన
Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా Read more

×