OTT: ఓటీటీలోకి వచ్చేసిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ

OTT: ఓటీటీలోకి వచ్చేసిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ

థియేటర్లలో విడుదలైన ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ మూవీ,థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని కామెడీ మూవీ,ఎలాంటి హడావిడి, ప్రకటనలు లేకుండా సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రేమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా కనిపించిన శ్రియా కొంతం ఈ మూవీలో కథానాయికగా పరిచయమైంది. ఇందులో అంకిత్ కొయ్య హీరోగా నటించాడు. ఇందులో వెన్నెల కిషోర్, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించగా శ్రీహర్ష మన్నే దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను ఈతరం యువత ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. మార్చి మొదటివారంలో థియేటర్లలో విడుదలైంది. కామెడీ బాగుందనే టాక్ వచ్చినప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Advertisements

 స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. శుక్రవారం నుంచి ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది.అంకిత్ కొయ్యా ఆ తర్వాత తెలుగులో అశ్వత్థామ, జోహార్, తిమ్మరుసు సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. అలాగే పలు వెబ్ సిరీస్ సైతం చేశాడు.

OTT: ఓటీటీలోకి వచ్చేసిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ

కథ

హర్ష(అంకిత్‌ కొయ్య) డైరెక్టర్‌ కావాలని కలలు కంటుంటాడు. క్రియేటివ్‌ కిసెస్‌(వెన్నెల కిశోర్‌) పెట్టిన యూట్యూబ్‌ ఛానెల్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. డేటింగ్‌ యాప్ ద్వారా ఆహాన(శ్రియ కొంతం)తో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరులవ్‌లో పడతారు. పేరెంట్స్ పెళ్లికి ఊరెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఆహాన హర్షని ఇంటికి ఆహ్వానిస్తుంది.ఆహాన పిలిస్తే హర్ష ఇక ఆలోచించకుండా ఆమె ఇంటికి వెళ్తాడు. ఇద్దరు ఆ రోజు బాగా ఎంజాయ్‌ చేస్తారు.ఆ రోజు రాత్రి హర్ష ఆహాన ఇంట్లోనే ఉంటాడు. మార్నింగ్‌ వెళ్లిపోదామనుకునే సమయంలోనే సడెన్‌గా పేరెంట్స్ వస్తారు. పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని వాళ్లు అనుకోకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. దీంతో హర్ష ఇంట్లోనే లాక్‌ అయిపోతాడు. వాళ్ల కంటపడకుండా మ్యానేజ్‌ చేస్తుంటారు. అంతలోనే కరోనా స్టార్ట్ అవుతుంది.దీంతో అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్న హర్ష ప్లాన్‌ బెడిసి కొడుతుంది.ఇక అధికారులు వీరి ఫ్యామిలీని ఐసోలేషన్‌ సెంటర్‌కి పంపిస్తారు. కానీ హర్ష ఇంట్లోనే ఇరుక్కుపోతాడు. దీంతో ఆ 14 రోజులు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్ని రోజులు ఎలా ఉన్నాడు? బయటకు వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నాలేంటి? ఐసోలేషన్‌ పూర్తయ్యాక ఆహాన, హర్ష జీవితంలో చోటు చేసుకున్న షాకింగ్‌ ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన కథ.

లవర్‌ ఇంటికి వెళ్లిన కుర్రాడు ఆ ఇంట్లోనే ఇరుక్కుపోతే అన్ని రోజులు ఎలా ఉన్నాడు? ఎలా మ్యానేజ్‌ చేశాడు? బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు? ఈ క్రమంలో ఎలాంటి ఫన్నీ సన్నివేశాలు, ఎలాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది సింపుల్‌గా ఈ మూవీ స్టోరీ ఫన్నీగా సాగుతుంది.రొమాంటిక్‌ టచ్‌తో ప్రారంభమై, కామెడీ సన్నివేశాలతో సాగుతూ, క్రమంగా ఉత్కంఠకు దారితీస్తూ, చివరికి సీరియస్‌గా మారి, ఎమోషనల్‌ సంఘటనలకు దారి తీస్తుంది.కథగా సింపుల్‌ స్టోరీ. కానీ దాన్ని ప్రజెంట్‌ చేసిన తీరు బాగుంది. ఈ జనరేషన్‌ని దృష్టిలో పెట్టుకుని యూత్‌కి కనెక్ట్ అయ్యేలా మూవీ ని తెరకెక్కించారు.

Related Posts
David Warner: రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన డేవిడ్ వార్నర్
David Warner: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రత్యేక అతిథిగా డేవిడ్ వార్నర్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్'. ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ Read more

Cinema :27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ఎల్‌2: ఎంపురాన్
Cinema :27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ఎల్‌2 ఎంపురాన్

సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఎల్‌2: ఎంపురాన్'. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'లూసిఫర్' కు Read more

ఏంటి పెద్దవాడివైపోయావా..? – ప్రభాస్ రెమ్యునరేషన్
1 (7 ప్రభాస్, మోహన్‌లాల్ రెమ్యునరేషన్ విషయంలో షాకింగ్ కామెంట్స్ – అసలు ఏం జరిగింది?

రెమ్యునరేషన్ గురించి ప్రభాస్, మోహన్‌లాల్ రియాక్షన్ – అసలు ఏమైంది? సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్, మోలీవుడ్, Read more

Salman Khan : సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు
Salman Khan సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు

Salman Khan : సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×