exame

సీటెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

నిరుద్యోగులు ఎదురు చూస్తున సీటెట్‌ పరీక్ష ప్రకటన విడుదల అయింది.
CTET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్‌ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ ctet.nic.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సీటెట్‌ పరీక్షను సీబీఎస్సీ ఏడాది రెండు సార్లు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్‌ సెషన్‌కు సంబంధించి.. 14, 15 (శని , ఆదివారం) తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు ఉంటాయి.
పేపర్‌-1 ఒకటి నుంచి 5వ తగతి వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం, పేపర్‌-2 ఆరు నుంచి 8వ తగతి వరకు బోధించే టీచర్ల కోసం పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పరీక్ష కేంద్రంలో ప్రవేశించేటప్పుడే బయోమెట్రిక్‌ తీసుకోనున్నారు. ఎవరైనా బయోమెట్రిక్‌ మర్చిపోయినా వారి పేపర్లను పరిగణనలోకి తీసుకునేది లేదని సీబీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షకు లేట్ వస్తే ప్రవేశం లేదని అధికారులు తెలిపారు.

Advertisements

పరీక్ష తేదీ: డిసెంబర్‌ 14, 15
పరీక్ష సమయం: పేపర్‌-2- ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్‌-1- మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు
వెబ్‌సైట్‌: ctet.nic.in

Related Posts
ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం: చంద్రబాబు
ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ గత పరిపాలన నుండి వచ్చిన తీవ్రమైన సవాళ్లను నొక్కిచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో Read more

Mithun Reddy: సిట్ విచార‌ణ‌కు హాజరైన మిథున్ రెడ్డి
Mithun Reddy: సిట్ విచార‌ణ‌కు హాజరైన మిథున్ రెడ్డి

లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, వైసీపీ Read more

కొండా సురేఖపై కేటీఆర్‌ పరువునష్టం దావా.. నేడు కోర్టులో విచారణ
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

హైదరాబాద్‌: స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరువునష్టంపై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. తన Read more

సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు
సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణులపై కఠినమైన వలస విధానాలు అమలు చేస్తున్న వేళ, సింగపూర్ మాత్రం భారతీయులకు సువర్ణావకాశం అందిస్తోంది. అక్కడి ప్రభుత్వం వీసా విధానాలను Read more

Advertisements
×