సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణులపై కఠినమైన వలస విధానాలు అమలు చేస్తున్న వేళ, సింగపూర్ మాత్రం భారతీయులకు సువర్ణావకాశం అందిస్తోంది. అక్కడి ప్రభుత్వం వీసా విధానాలను సవరించి, ఉద్యోగ వేతనాలను పెంచుతూ, నిపుణులకు దీర్ఘకాలిక పని అవకాశాలు కల్పిస్తోంది. ఓవైపు అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణుల్ని వలసదారులుగా చూపుతూ తమ దేశం నుంచి తరిమేస్తున్న వేళ సింగపూర్ వీరికి ఆహ్వానం పలుకుతోంది. అమెరికా వలస విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల్ని తమ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇందుకు తమ వీసా విధానాల్ని సైతం సవరిస్తోంది. అంతే కాదు ఇలా తమ దేశానికి వచ్చే భారతీయ నిపుణులకు ఇప్పటివరకూ చెల్లిస్తున్న జీతాల్ని సైతం పెంచుతోంది.

Advertisements
సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు


వర్క్ పర్మిట్ ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండవచ్చు
ఈ ఏడాది జూలై నుంచి సింగపూర్ లో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం వర్క్ పర్మిట్లు కలిగిన నిపుణులకు గరిష్ట పని కాల వ్యవధి నిబంధనను తొలగించబోతోంది. దీంతో విదేశీ నిపుణులు వర్క్ పర్మిట్ ఉంటే ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండి పని చేసుకోవచ్చు. నిర్మాణ రంగం, ఓడల నిర్మాణం, తయారీ రంగంలో దీర్ఘకాలిక కెరీర్ కావాలనుకునే వారికి సింగపూర్ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతోంది. అలాగే ఇలా వచ్చే విదేశీ నిపుణుల పదవీ కాలాన్ని 63 ఏళ్లకు పెంచబోతోంది.
ఉద్యోగావకాశాలు పెంచాలని సింగపూర్ నిర్ణయం
మార్కెట్లో పోటీ తత్వం పెంచేందుకు వీలుగా మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ కు జీతాల్ని కూడా పెంచాలని నిర్ణయించింది. దీంతో భారతీయ నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.34.7 లక్షలకు పెంచుతోంది. దీన్ని జనవరి 2025 నుంచే వర్తింప చేయబోతోంది. అలాగే ఆర్ధిక వ్యవహారాల నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.38.4 లక్షలుగా నిర్ణయించింది.

Related Posts
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పై స్పందించిన ప్రశాంత్ కిశోర్..
Prashant Kishor reaction on AAP defeat..

అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందన్న పీకే న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. Read more

కేంద్రమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేశ్ భేటీ
Minister Nara Lokesh meet Union Minister Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు Read more

Tulsi Gabbard : భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది – తులసీ గబ్బార్డ్
tulsi gabbard

అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్, రాజకీయ నాయకురాలు తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై తన గాఢమైన భక్తిని వ్యక్తం చేశారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANI న్యూస్ Read more

Revanth Reddy : భూభారతిపై రేవంత్ రెడ్డి సమీక్ష!
Revanth Reddy భూభారతిపై రేవంత్ రెడ్డి సమీక్ష!

తెలంగాణలో భూసంబంధిత సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా మరో ముందడుగు పడింది. ఈ నెల 14వ తేదీ నుంచి భూభారతి పేరుతో ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను Read more

×