జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.
జమ్ములోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. చోటుచేసుకున్నాయి. . కుల్గామ్ జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.
ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు
ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారని ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా వెళ్లడించింది. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని పేర్కొంది. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించింది. కుల్గామ్‌లో భద్రతా బలగాలు మరిన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాల్పులో మరణించిన టెర్రరిస్టుల మృతదేహాలను అధికారుల పరిశీలిస్తున్నారు.
![jammu](https://vaartha.com/wp-content/uploads/2024/12/jammu-1.jpg.webp)