farmers protest

‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత

కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు శనివారం పునఃప్రారంభించిన ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాలాకాలంగా రైతులు తమ డిమాండ్స్ కోసం ఉద్యమం చేస్తున్నారు. శనివారం మరోసారి రైతులు ఉద్యమం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే రైతుల పాదయాత్రను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. హర్యానా-పంజాబ్ సరిహద్దులో రైతులను చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఈ పాదయాత్రలో 101 మంది రైతులు పాల్గొనగా దాదాపు 10 మంది రైతులు గాయపడ్డారు. దీంతో మరోసారి ‘ఛలో ఢిల్లీ’ యాత్రను నిలిపివేస్తూ రైతులు నిర్ణయించుకున్నారు.
బజరంగ్ పునియా శంభు విమర్శలు
కాగా, కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్ బజరంగ్ పునియా శంభు సరిహద్దులో రైతులను కలిసి మాట్లాడారు. రైతులను అడ్డుకోవడం లేదని చెబుతూనే బాష్పవాయువు ప్రయోగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. శంభు సరిహద్దును పాకిస్థాన్ సరిహద్దులా వ్యవహరిస్తున్నారని, రైతు నేతలు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.

Advertisements

డిసెంబరు 6న రైతులు ‘ఛలో ఢిల్లీ’ నిరసన ర్యాలీ మొదలుపెట్టారు. అయితే శంభు సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్నారు. డిసెంబరు 6, 8 తేదీలలో కూడా రైతులను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఇవాళ మరోసారి ప్రయత్నించారు.

Related Posts
శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు కలకలం
fake currency racket busted

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం Read more

Murder: యోగ టీచర్ గోతిలో సజీవంగా పాతి పెట్టిన వ్యక్తి ఎందుకంటే?
Murder: యోగ టీచర్ గోతిలో సజీవంగా పాతి పెట్టిన వ్యక్తి ఎందుకంటే?

వివాహేతర సంబంధం.. హత్యకు దారితీసిన పరిణామాలు హర్యానాలోని చక్రి దాద్రిలో ఓ దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు. Read more

జనవరి 10 నుండే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
sankranthi school holidays

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించిన పాఠశాలల సెలవులపై స్పష్టతనిచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 10నుంచి సెలవులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే Read more

తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక
tirupati stampede incident

తిరుపతి టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అధికారుల నుంచి సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది. ఈ నివేదికలో ఘటనకు సంబంధించిన వివరాలను, కారకాలను స్పష్టంగా Read more

Advertisements
×