రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్ “చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను చేసినట్టుగా ప్రకటించి విమర్శల పాలవుతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార పోస్టర్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయలను అధిగమించాయని విడుదల చేసారు , ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల రూపాయలను వసూలు చేసిందని చర్చ నడుస్తుంది .
100crFakeForGameChanger మరియు #GameChangerPosterScam వంటి హ్యాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలో ఈ వ్యత్యాసం గురించి ట్రెండ్ అవుతుంది . సినిమా మార్కెటింగ్ బృందం విడుదల చేసిన గణాంకాల ప్రామాణికతను చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు .
జనవరి 10,2025న విడుదలైన గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య, జయరామ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
వివాదం బయటపడటంతో, అభిమానులు మరియు పరిశ్రమ నిపుణులు బాక్సాఫీస్ రిపోర్టింగ్లో మరింత పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం లో ప్రభ్తం సినిమాకు ఇచ్చిన వెసులుబాటును కూడా , కోర్టు సూచనల వాళ్ళ వెనక్కు తీసుకోవడం తో సినిమా పైన ఆర్ధిక పరం గా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .