ఐఐటీ రిసెర్చ్‌ స్కాలర్‌పై ఏసీపీ అఘాయిత్యం: విధుల్లో నుంచి తొలగింపు

ఐఐటీ రిసెర్చ్‌ స్కాలర్‌పై ఏసీపీ అఘాయిత్యం: విధుల్లో నుంచి తొలగింపు

పెళ్లి పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మొదట వెంటబడటం తర్వాత మోసం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఓ రీసెర్చ్ చేస్తున్న అమ్మాయిని పోలీస్ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నారు. లక్నోలోని ఐఐటీ లో సైబర్‌క్రైమ్‌, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్న ఓ అమ్మాయి ఏసీపీతో పరిచయం ఏర్పడింది. ఇదే అదనుగా తీసుకున్న పోలీస్‌ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నారు. అనంతరం మాటమార్చడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసును విచారించిన పోలీసులు అతడిని విధుల నుంచి తప్పించిన సీపీ.. విచారణ కోసం అడిషనల్ డీసీపీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.

Advertisements

బాధితురాలు ఐఐటి కాన్పూర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నది. సైబర్‌క్రైమ్‌, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా కాన్పూర్‌ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌ (ACP) మహమ్మద్‌ మోహిసిన్‌ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆమెను ప్రేమలోకి దించిన ఏసీపీ.. తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఆమెపై అఘాయిత్యానికి ఒటిగట్టాడు. అనంతరం ఇచ్చిన మాటను తప్పడంతో మోసపోయానని గ్రహించిన ఆమె నగర పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు.
తీవ్రమైన సెక్షన్లు నమోదు
డీసీపీ అంకితా శర్మ, ఏడీసీపీ అర్చన సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వారు కాన్పూర్ ఐఐటీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు చెప్పిన దాంట్లో నిజం ఉందని తేలడంతో సీపీ అఖిల్ కుమార్‌కు నివేదిక అందించారు. దీంతో ఏసీపీపై అత్యాచారం సహా తీవ్రమైన సెక్షన్ల కింద ఏసీపీపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అతడిని విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

Related Posts
Pahalgham Attack: నా కొడుకు హంతకులలో ఉంటే కాల్చి చంపండి – ఆదిల్ తల్లి
Pahalgam Attack: నా కొడుకు హంతకులలో ఉంటే కాల్చి చంపండి – ఆదిల్ తల్లి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ పై వచ్చిన ఆరోపణలతో షాజాదా బానో, అతని తల్లి, స్పందించారు. ఆమె మీడియా ద్వారా తన కొడుకు Read more

high court : పోర్న్‌ చెడ్డ అలవాటే, అలాని విడాకులు కుదరదు: హైకోర్టు
పోర్న్‌ చెడ్డ అలవాటే, అలాని విడాకులు కుదరదు: హైకోర్టు

భార్య పోర్న్ వీడియోలకు బానిసగా మారిందనే కారణంతో విడాకులు మంజూరు చేయలేమని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాదు, పెళ్లైనంత మాత్రాన మహిళలు తమ లైంగిక Read more

మృతులకు పరిహారం ప్రకటించిన యూపీ ప్రభుత్వం
UP government has announced compensation for the deceased

ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను డీఐజీ మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 Read more

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు
శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు

శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు:- ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, Read more

Advertisements
×