UP government has announced compensation for the deceased

మృతులకు పరిహారం ప్రకటించిన యూపీ ప్రభుత్వం

ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్‌ డీఐజీ వైభవ్‌కృష్ణ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను డీఐజీ మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య ఒకట్రెండు చోట్ల తొక్కిసలాట జరిగిందని.. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందన్నారు. తొక్కిసలాట ఘటనలో 60 మంది గాయపడ్డారని డీఐజీ చెప్పారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందని.. వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1920ను సంప్రదించాలని డీఐజీ సూచించారు.

మృతులకు ₹25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతులకు యూపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఈ అంశాన్ని దర్యాప్తు చేసి.. నిర్ణీత కాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే సీఎస్‌, డీజీపీ స్వయంగా ఒకసారి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి ఆయా అంశాలను పరిశీలిస్తారని తెలిపారు.

image

కాగా, మౌని అమావాస్య కావడంతో బుధవారం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య రోజున అమృత స్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం, ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటంతో కొందరు బారికేడ్లను బద్దలు కొట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. మరోపక్క మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

Related Posts
నా ఇంటికి నన్ను ఎందుకు వెళ్లనివ్వడం లేదు : కేతిరెడ్డి పెద్దారెడ్డి
peddareddy

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్వగ్రామం తాడిపత్రికి వచ్చేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకోగా.. అందుకు పోలీసులు అనుమతించని పరిస్థితి Read more

తెలంగాణలో ఇసుజు మోటార్స్ ఇండియా విస్తరణ
Isuzu Motors India has expanded its service footprint in Telangana

హైదరాబాద్‌: ఇసుజు మోటార్స్ లిమిటెడ్, జపాన్ యొక్క అనుబంధ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా తెలంగాణలో తన సర్వీస్ ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది. మరియు ఈరోజు ఖమ్మంలో Read more

బాధితులను కలవనున్న రాహుల్ గాంధీ
rahul gandhi

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సోమవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పర్భానీ జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో బాధిత కుటుంబాలను కలవనున్నారు. Read more

ప్రజల వద్ద 2 వేలు కరెన్సీ నోట్లు:ఆర్బీఐ
ప్రజల వద్ద 2 వేలు కరెన్సీ నోట్లు:ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, Read more