పోర్న్‌ చెడ్డ అలవాటే, అలాని విడాకులు కుదరదు: హైకోర్టు

high court : పోర్న్‌ చెడ్డ అలవాటే, అలాని విడాకులు కుదరదు: హైకోర్టు

భార్య పోర్న్ వీడియోలకు బానిసగా మారిందనే కారణంతో విడాకులు మంజూరు చేయలేమని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాదు, పెళ్లైనంత మాత్రాన మహిళలు తమ లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని, హస్తమైధునం హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది. కింది కోర్టు తన విడాకుల అభ్యర్ధనను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. తన భార్య పోర్న్ వీడియోలను చూస్తూ హస్తమైధునానికి బానిసైందని అతడు ఆరోపించాడు.

Advertisements
పోర్న్‌ చెడ్డ అలవాటే, అలాని విడాకులు కుదరదు: హైకోర్టు

అప్పీల్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం
అతడి అప్పీల్‌ను తోసిపుచ్చిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్ పూర్ణిమల ధర్మాసనం.. ‘స్వీయ ఆనందం నిషేధిత ఫలం కాదు’ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ‘పురుషులలో హస్తప్రయోగం సార్వత్రికమైందని అంగీకరించినప్పుడు ఈ విషయంలో స్త్రీలకు కళంకాన్ని ఆపాదించడం తగదు’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
దీనిని నైతికంగా సమర్దించలేం కానీ..
అయితే, పోర్న్ వీడియోలకు బానిసగా మారడం మాత్రం చెడ్డ అలవాటే.. దీనిని నైతికంగా సమర్దించలేం కానీ, ఈ కారణంతో విడాకులు మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. అంతేకాదు, భార్య తన జీవిత భాగస్వామిని బలవంతం చేయకుండా ప్రైవేట్‌గా పోర్న్ చూసినంత మాత్రాన అది వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ‘పోర్న్ వీడియోలు చూడటం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు… కానీ, జీవిత భాగస్వామితో క్రూరంగా ప్రవర్తించినట్లు కాదు
వేరొకరితో లైంగిక సంబంధం కొనసాగిస్తే..
‘వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కాకుండా వేరొకరితో లైంగిక సంబంధం కొనసాగిస్తే ఆ కారణంతో విడాకులను మంజూరు చేయవచ్చు. అయితే, స్వీయ ఆనందంలో మునిగిపోవడం వివాహాన్ని రద్దు చేయడానికి కారణం కాకూడదు.. ఎంత ఊహకు అందనంత దూరంలో ఉన్నా, క్రూరత్వంగా ఆపాదించలేం.. ’ అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

Related Posts
Ambani, Adani: ట్రంప్ విధానాల వల్ల కరిగిపోతున్న అంబానీ, అదానీల సంపద
ట్రంప్ విధానాల వల్ల కరిగిపోతున్న అంబానీ, అదానీల సంపద

ఈ ఏడాది సంపన్నులకు అంతగా కలిసిరాలేదేమో, ఎందుకంటే వీరి సంపద ఒక్కరోజులోనే భారీగా ఆవిరైపోతుంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు భారీగా నష్టాలను Read more

వలసదారులను వెనక్కి పంపడం అమెరికాకే నష్టం: ఆర్ధిక వేత్తలు
వలసదారులను వెనక్కి పంపడం అమెరికాకే నష్టం: ఆర్ధిక వేత్తలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా వరుస యూటర్న్ లు తీసుకుంటున్నారు. ఆరంభంలో వలసదారులని వారి స్వదేశాలకు తరిమేస్తే కానీ ఊరుకోనంటూ Read more

ఆత్మహత్యకు పాల్పడిన IFS అధికారి
ఢిల్లీ చాణక్యపురిలో IFS అధికారి ఆత్మహత్య – పోలీసులు అనుమానాల్లో!

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు (IFS) అధికారి జితేంద్ర రావత్ (42) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సంచలనంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో Read more

భారతీయులకు సౌదీ అరేబియా షాక్
visa

తమ దేశానికి వచ్చే వారిని నియంత్రించడంలో భాగంగా సౌదీ అరేబియా వీసా రూల్స్‌ను కఠినతరం చేసింది. దీంతో భారత్ నుంచి అధికంగా సౌదీ అరేబియాకు వెళ్లే వారికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×