Central cabinet meeting tomorrow

రేపు కేంద్ర కేబినెట్ భేటీ..

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే పలు ప్రాజెక్టులు, అభివద్ధి పథకాలకు కేంద్ర కేబినెట్ నిధులు మంజూరుపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. అదేవిధంగా ఈ నెలలో జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఇస్తున్న హామీల మేరకు కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ , జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముండగా.. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నందున వాటికి ప్యాకేజీ లేదా కేంద్ర పథకాల్లో మెజార్టీ వాటా ఇవ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Related Posts
కాల్పుల విరమణపై పుతిన్ సూత్రప్రాయ అంగీకారం
కాల్పుల విరమణపై పుతిన్ సూత్రప్రాయ అంగీకారం

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం కల్పించేందుకు అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే, దీనికి Read more

రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర.. కైవ్ లో సమావేశం
రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర.. కైవ్ లో సమావేశం

రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన మూడేళ్లైన సందర్భంగా, ప్రపంచ నాయకులు ఉక్రెయిన్‌కు మద్దతు తెలియజేయడానికి కైవ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటన ఉక్రెయిన్‌కు రాజనీతి, భద్రత, ఆర్థిక పరంగా Read more

రోజా కూతురు ర్యాంప్ వాక్ పిక్ వైరల్
Roja's daughter Anshu Malik

ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక తన ప్రతిభతో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన Read more

మీ టికెట్ యాప్: బుకింగ్‌ సులభతరం
మీ టికెట్ యాప్: బుకింగ్‌ సులభతరం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ టికెట్ యాప్ పౌరులు, పర్యాటకులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి రూపొందించబడింది. మెట్రో, బస్సు ప్రయాణాలు, ఆలయ దర్శనాలు, పార్కుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *