sandeep dikshit

రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ ఎలా చెప్పగలదు : సందీప్‌ దీక్షిత్‌

కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. ఈ సందర్బంగా ఈవీఎంల రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ చేసిన ప్రకటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతున్నదని అయన వ్యాఖ్యానించారు. ఈవీఎంలను రిగ్గింగ్‌ చేయడం అసాధ్యమని కొద్దిసేపటి క్రితం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

Advertisements

న్యూఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌ ఈవీఎంలపై మరోసారి విమర్శలు చేశారు. ఈవీఎంల రిగ్గింగ్‌ అసాధ్యమని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ చోటుచేసుకుందని అన్నారు. ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి పడుతున్నా కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ అసాధ్యమని చెప్పడం అమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు సామాన్య ప్రజలు చాలా మంది ఈవీఎంల రిగ్గింగ్‌ గురించి మాట్లాడారని చెప్పారు.

‘మీరెందుకు అనవసరంగా ఓట్లడుగుతున్నారు..? ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకే పడుతున్నాయిగా. ఈవీఎంలు ఉన్నంత కాలం ఓట్లు బీజేపీకే వెళ్తాయి’ అని సామాన్యులు అంటున్నట్లు సందీప్‌ దీక్షిత్‌ తెలిపారు. ఈవీఎంలు ఉన్నంత కాలం బీజేపీ తప్ప మరే పార్టీ గెలువదని సామాన్యులు చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Related Posts
IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!
IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ Read more

Amit shah: ఆయుధాలు మార్పును తీసుకురాలేవు – అమిత్ షా
ఆయుధాలు మార్పును తీసుకురాలేవు - అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం, నక్సలైట్లు పై జరుగుతున్న దాడులను వ్యాఖ్యానిస్తూ, ఆయుధాలు మరియు హింస మార్పును తెచ్చే సాధనంగా చూడలేదని, శాంతి, అభివృద్ధి మాత్రమే Read more

రాహుల్‌గాంధీపై విచారణ
rahul

పార్లమెంటు ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ ఘటనకు సంబంధించి.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ప్రశ్నించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎంపీల మధ్య Read more

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!
manmohan singh bharatartna

భారత ఆర్థిక వ్యవస్థకు ఆధునిక రూపం ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతి Read more

×