manipur cm

పీవీ కూడా మణిపూర్ లో పర్యటించలేదు: బీరేన్ సింగ్

గత ఏడాదిన్నరగా మణిపూర్ లో జాతులమధ్య జరుగుతున్న హింసలో వందలాది మంది జనం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి మణిపూర్ రగిలిపోతున్నది. ప్రజలు ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఓవైపు మణిపూర్ వాసులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే మోదీ మాత్రం విదేశీ పర్యటనలకు వెళుతున్నాడని మండిపడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలో తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు మణిపూర్ మంటలను చల్లార్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ కానీ బీజేపీ నేతలు కానీ పెద్దగా స్పందించలేదు.


స్పందించిన సీఎం బీరేన్ సింగ్
తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. జైరామ్ రమేశ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. అసలు మణిపూర్ లో మంటలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, 1992లో మణిపూర్ లో అల్లర్లు మొదలయ్యాయని ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం మయన్మార్ తో, మయన్మార్ మిలిటెంట్లతో కుదుర్చుకున్న ఒప్పందంతో మణిపూర్ లో అల్లర్లకు బీజం పడిందని చెప్పారు. 1992-97 మధ్య కాలంలో మణిపూర్ లోని నాగా, కుకీ తెగల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.

అప్పట్లో ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు మణిపూర్ లో పర్యటించారా.. ఎందుకు పర్యటించలేదని కాంగ్రెస్ నేతలను బీరేన్ సింగ్ నిలదీశారు. ఆ తర్వాత కూడా 1997- 98 మధ్య కాలంలో కుకీలు, పైతీల మధ్య గొడవలు జరిగి రాష్ట్రంలో 350 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

అప్పుడు ప్రధానిగా ఉన్న ఐకే గుజ్రాల్ మణిపూర్ లో పర్యటించారా..? రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారా? అని ప్రశ్నించారు.

Related Posts
విమానానికి బాంబు బెదిరింపులు.. రాయ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్‌
Bomb threats to the plane. Emergency landing in Raipur

రాయ్పూర్ : దేశంలో ఇటీవల వందలాది విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విమానానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్‌ Read more

అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

సుప్రీం కోర్టు హైకోర్టుల తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కోర్టులు తమ అధికార పరిధిని దాటిపోతున్నాయని, ఇది సరైన విధానం కాదని కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం Read more

రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
Piyush Goyal breaks down re

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి Read more

CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
CBI searches former CM Bhupesh Baghel house

CBI Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు Read more