పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాల తయారీకి సాయపడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ డీసీ) కూడా ఉంది. ఇది పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది.
నాలుగు కంపెనీలపై ఆంక్షలు
ఇది సామూహిక జనహనన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాక్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో పాటు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగానికి వినియోగించే పరికరాలను ఎన్ డీసీ కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా వెల్లడించింది. ఈ పరికరాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను ఎన్ డీసీకి అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ సరఫరా చేస్తోందని తెలిపింది.
అమెరికా పక్షపాతధోరణి: పాక్ ఆరోపణ
ఎన్ డీసీ తరఫున మిసైల్ లో వినియోగించే పలు పరికరాలను అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ చెప్పారు. కాగా, తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పాక్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా మరోసారి పునరాలోచించాలి పాక్ కోరుతున్నది.

Advertisements
Related Posts
China tariff : శ్వేతసౌధం చర్యకు దీటుగా డ్రాగన్‌ స్పందన
China response to US action

China tariff : అమెరికా విధించిన 145 శాతం సుంకాలకు దీటుగా చైనా ప్రతిస్పందించింది. అమెరికా సరకులపై సుంకాలను ప్రస్తుత 84 శాతం నుంచి 125 శాతానికి Read more

Donald Trump: ట్రంప్‌కు బ్రిటన్ కోర్టు జరిమానా విధింపు
హౌస్ న్యాయమూర్తుల ఇంజక్షన్ అధికారాన్ని పరిమితం చేసే బిల్లుకు ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలింది.యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ మాజీ గూఢచారిపై పరువునష్టం దావా వేయాలని ప్రయత్నించిన ట్రంప్‌కు లండన్ హైకోర్టు Read more

పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి!
పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి!

పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి! ఏందుకు? పాకిస్తాన్ దశాబ్దాలుగా, వ్యూహాత్మక కారణాలతో తాలిబాన్‌లను పెంచి పోషించింది. చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించి, సైనిక సహాయాన్ని అందించింది. Read more

అమెరికాలో మాడిసన్ స్కూల్లో 15 ఏళ్ల బాలిక కాల్పులు..
us school shooting

యునైటెడ్ స్టేట్స్‌లో బాలికలచే స్కూల్ షూటింగ్స్ చాలా అరుదుగా జరుగుతాయి. మొత్తం కాలంలో జరిగిన దాడులలో సుమారు 3% మాత్రమే మహిళలు బాధ్యులుగా ఉంటారు.తాజాగా, మాడిసన్, విశ్కాన్సిన్‌లోని Read more

×