fire crackers blast

పటాకుల పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి

తరచుగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తున్నా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నది. దీనితో అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్‌ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పటాకుల పేలుడు ధాటికి కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఎగరిపడ్డారు. సమీపంలోని ఆరు ఇండ్లు ధ్వంసమయ్యాయి.


పోలీసులు సహాయక చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశామన్నారు.
కాగా, గతేడాది అక్టోబర్‌లో కూడా తిరువూరు జిల్లాలోని ఓ పటాకుల గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వారిలో 9 నెలల చిన్నారి కూడా ఉన్నది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 ఇండ్లకుపైగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు.

Related Posts
UFBU Bank: బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరెన్..కస్టమర్లకు అలెర్ట్
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరెన్..కస్టమర్లకు అలెర్ట్

బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నారు. ఇందుకు మార్చి 24 నుండి 25 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మెకు యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ Read more

రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
Good news for retired emplo

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు తపాలా శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడం లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు ఇండియా పోస్ట్ Read more

సామ్‌సంగ్ గెలాక్సీ భారీ డిస్కౌంట్
samsung

ఒక పూట ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే జీవితమే ఆగిపోయినట్లుగా అవుతుంది. మన బలహీనతల్ని ఆసరాచేసుకుని పలు కంపనీన్లు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. Read more

అతుల్ ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్ట్ విచారం
atul subhash2 1733912740

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకింద నమోదయినా సెక్షన్ 498ఏపై చర్చకు దారితీసింది. ఈ సెక్షన్ దుర్వినియోగంపై Read more