mexico and usa

ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షురాలు కౌంటర్‌

పొరుగు దేశాలపై అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన యూఎస్‌ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందే ట్రంప్‌ వ్యవహారశైలి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

ముఖ్యంగా పొరుగు దేశాలపై ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కెనడా, గ్రీన్‌లాండ్‌, పనామా కెనాల్‌ తమకేనంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. ఇక అదేవిధంగా గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో ను ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’ గా మారుస్తానంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ తాజాగా స్పందించారు. తామెందుకు అమెరికాను ‘మెక్సికన్‌ అమెరికా’ అని పిలవకూడదంటూ ట్రంప్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

కెనడా 51వ రాష్ట్రమని ప్రకటన..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్‌.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఈ ప్రకటన తర్వాత ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రూడోకు ట్రంప్‌ కీలక హెచ్చరికలు జారీ చేశారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణాలను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని సూచించారు. ఈ క్రమంలో ‘గవర్నర్‌ ఆఫ్‌ కెనడా’ అంటూ ట్రూడోపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

Related Posts
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి: విద్యుత్ పరిమితులు విధించిన ప్రభుత్వం
UkraineRussiaConflictWar

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెంస్కీ ఇటీవల ఒక ప్రకటనలో, రష్యా 120 మిసైళ్ళు మరియు సుమారు 100 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఈ దాడులు కీవ్‌తో పాటు Read more

భారత్‌పై అధిక పన్నులు: ట్రంప్
అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పన్నులు విధించే కొత్త మార్గాన్ని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి, అమెరికా ఇప్పుడు ప్రతి దేశంపై అమెరికన్ వస్తువులపై Read more

ట్రంప్ తో నేరుగా పని చేయాలని అనుకుంటున్నాను – జెలెన్‌స్కీ
ట్రంప్, పుతిన్ ఉచ్చులో జెలెన్స్కీ?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ, ఫిబ్రవరి 2022 లో ప్రారంభమైన యుద్ధంలో రష్యా దాడులు తీవ్రతరంగా మారటంతో, అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో నేరుగా Read more

సైనిక విమానాల్లో భారతీయులను వెనక్కి పంపుతున్న ట్రంప్
41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో అమెరికన్లకు మాటిచ్చినట్లుగానే ప్రస్తుతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో Read more