skin cancer

చర్మ క్యాన్సర్ అవగాహన మరియు నిర్ధారణ

చర్మం మన శరీరానికి ప్రధాన రక్షణ కవచం. చర్మం వాతావరణ కాలుష్యం, జీవనశైలిలో మార్పులు వంటి కారణాలతో అనేక సమస్యలకు గురవుతోంది. దీనిలో చర్మ క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా ఉన్నాయి.

Advertisements

చర్మం మూడు పొరలను కలిగి ఉంది: ఎపిడెర్మిస్ (బాహ్య చర్మం), డెర్మిస్ (మధ్య చర్మం), మరియు హైపో డెర్మిస్ (అంత: చర్మం). ఎపిడెర్మిస్ పొరలో కెరాటిన్, మెలానిన్ వంటి ప్రొటీన్లు ఉంటాయి. ఇవి చర్మానికి రంగును మరియు రక్షణను అందిస్తాయి. డెర్మిస్ పొరలో రక్తనాళాలు, గ్రంథులు, నాడులు ఉన్నాయి. ఇవి చర్మానికి పోషణ, సున్నితమైన స్పర్శ అనుభూతి ఇస్తాయి. హైపో డెర్మిస్ పొర చర్మానికి మద్దతు, ఇన్సులేషన్ మరియు కొవ్వును నిల్వ చేస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యం కోసం పలు జాగ్రత్తలు అవసరం. వేడి, చల్లని వాతావరణాలు, కాలుష్యం మరియు బ్యాక్టీరియాలకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి సక్రమంగా స్కిన్ కేర్ రొటీన్ అనుసరించడం ముఖ్యం. పులిపీర్లు, మొటిమలు వంటి చర్మ సమస్యలకు పరిష్కారంగా వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం సరైన చికిత్సలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ విధంగా, చర్మం రక్షణ కవచంగా పనిచేయడానికి అవసరమైన ఆరోగ్యాన్ని పొందగలదు.

హార్మోన్ల అసమతుల్యత కారణంగా మొటిమలు సాధారణంగా యుక్త వయసులో ముక్కు, ఛాతీ, వీపు వంటి ప్రాంతాలలో కనిపిస్తాయి. వీటిని తగ్గించేందుకు విటమిన్ ఎ, సాలిసైలిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్, యాంటీబయాటిక్స్ ఉపయోగించడం సమర్థవంతం. అయితే, సరిగ్గా పరీక్షించుకొని సరైన చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

1.అక్టీనిక్ కెరాటోసిస్ (ఏకే): ఇది మొదటి దశ క్యాన్సర్, ముఖ్యంగా మెడ, చేతులు, మోచేతులు, మరియు తలపై చిన్న మొటిమలుగా కనిపిస్తుంది. తెల్ల చర్మం ఉన్నవారిలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్, స్క్వామో సెల్ కార్సినోమాకు తొలి సంకేతంగా పరిగణించబడుతుంది. మునుపే గుర్తించి చికిత్స చేపడితే, దీని నుంచి బయటపడవచ్చు.

2.బేసల్ సెల్ కార్సినోమా (బీసీసీ): ఇది అత్యంత సాధారణ చర్మ క్యాన్సర్. ముత్యంలాంటి గడ్డల రూపంలో చర్మంపై కనిపించి, ఇతర శరీర భాగాలకు వ్యాపించే అవకాశముంది. సకాలంలో చికిత్స లేకపోతే, చర్మ కణాలను నాశనం చేయడంతో పాటు ఎముకలకు కూడా వ్యాపించవచ్చు.

3.స్వ్కామోస్ సెల్ కార్సొనోమా (ఎస్ సీసీ): ఇది శరీరంలో ఎక్కడైనా మొదలై మళ్లీ మళ్లీ వస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే,క్యాన్సర్ నుండి తప్పించుకోవచ్చు.

4.మెలానోమా క్యాన్సర్: ఇది అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్, 25-39 ఏళ్ల వయస్కులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎండలో నేరుగా ఉండడం వల్ల మెలానోమా అభివృద్ధి చెందుతుంది.

క్యాన్సర్ నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ‘ఏబీసీడీఈ’ పద్ధతి ద్వారా మచ్చల లక్షణాలను గమనించడం ముఖ్యమైనది. చికిత్సలు ద్రవ నైట్రోజన్, లేజర్, కీమోథెరపీ, మరియు రేడియేషన్‌తో చేస్తారు.

Related Posts
Sabja Seeds: వేసవిలో సబ్జా గింజలు మేలు
Sabja Seeds: వేసవిలో సబ్జా గింజలు మేలు

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే సబ్జా గింజల ప్రత్యేకత వేసవి కాలం వచ్చిందంటే చల్లని పానీయాల జోలికి వెళ్లడం సహజమే. ఎండలో తిరుగుతున్నప్పుడు లస్సీ, ఫలాదా, శీతలపానీయాలను Read more

గురక సమస్య: గుండెపై ప్రభావం చూపక ముందు చికిత్స తప్పనిసరి
snoring

గురక అనేది మన హృదయంతో సంబంధం ఉన్న ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. చాలామంది ఈ సమస్యను చిన్నగా అనుకుంటారు , కానీ నిపుణులు చెప్తున్నట్లుగా, గురక Read more

ఆధునిక ఆహారపు అలవాట్ల సవాళ్లు
fast food junk food snack 7cf36c 1024

ఆధునిక జీవనశైలి ఫాస్ట్ ఫుడ్‌ను ప్రాధమిక ఆహారంగా మారుస్తోంది. కానీ దీని ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను గుర్తించడం ముఖ్యం. ఫాస్ట్ ఫుడ్ అధిక కొవ్వు, చక్కెర, Read more

తేనె తో బాదం కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా!
తేనె తో బాదం కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా!

బాదంపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలుకలిగించే న్యూట్రిషన్ ఫుడ్. అదే విధంగా తేనెను ప్రాచీన ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించేవారు. ఈ రెండు కలిపి తింటే ఆరోగ్య పరంగా ఎన్నో Read more

×