gas leak

కొనసాగుతున్న భోపాల్ గ్యాస్ వ్యర్థాల తొలగింపు

భోపాల్ లో 40 ఏళ్ళ క్రితం జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన వేదన ఇంకా వెంటాడుతున్నది. నిద్రలోనే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఆనాటి దుర్ఘటన ఎవరూ మర్చిపోలేని గాయం అది. అప్పట్లో లీకైన విష వాయువుకు సంబంధించిన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తొలుత ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ చేసిన సుమారు 377 టన్నుల వ్యర్థాలను పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించి, ఇంజనీరింగ్ నిపుణులతో వాటిని మండించనున్నారు.


3,800 మంది ప్రాణాలు కోల్పోయారు
1984 డిసెంబరు 2 అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ప్రమాదకర మీథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) గ్యాస్ లీక్ అయింది. ఈ విషవాయువు గాలిలో కలిసి ఫ్యాక్టరీ పరిసరాలతో పాటు భోపాల్ సిటీలో వ్యాపించింది. విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ కార్మికులతో పాటు భోపాల్ లో మొత్తం 3,800 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం
ఇందులో భాగంగా బుధవారం రాత్రి విషపూరిత రసాయన వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్లలో లోడ్ చేశారు. వంద మంది కార్మికులు షిప్టుల వారీగా (అరగంట చొప్పున) పనిచేశారు. పని పూర్తయ్యాక కార్మికులకు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు.

అనంతరం కంటైనర్ ట్రక్కులు అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని పిథంపూర్ కు బయలుదేరాయి. ట్రక్కులు జాగ్రత్తగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ వ్యర్థాలను రామ్‌కీ ఎన్విరో ఇంజినీరింగ్ కళాశాల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ధ్వంసం చేయనున్నారు. ఇందుకు 153 రోజులు పడుతుందని అధికారుల అంచనా.

Related Posts
బ్యాంకులకు ఆదివారం సెలవు లేదు: ఆర్బీఐ
బ్యాంకులకు ఆదివారం సెలవు లేదు: ఆర్బీఐ

ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 31 మార్చి 2024న బ్రాంచులు తెరిచి ఉండేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరింది. Read more

ఢిల్లీలో మంచుపొగతో ఆల‌స్యంగా విమానాలు
flights

ఢిల్లీలో మంచుతో పాటు కాలుష్యం తోడు కావడంతో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇవాళ ఉద‌యం వంద‌కుపైగా విమానాలు ఆల‌స్యం అయ్యాయి. వాతావరణం స‌రిగా Read more

ఢిల్లీ సీఎం ఎన్నిక – అబ్జర్వర్లను నియమించిన బిజెపి
bjp 1019x573

ఢిల్లీ రాజకీయ సమీకరణాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎన్నికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి Read more

వరదలతో చెన్నై అతలాకుతలం..
chennai flood

చెన్నై నగరాన్ని భారీ వర్షాలు , వరదలు వదలడం లేదు. ప్రతి ఏటా ఇలాంటి వర్షాలు , వరదలకు అలవాటుపడిపోయిన జనాలు చిన్న వర్షం పడగానే ముందుగానే Read more