liquid thrown on arvind kej

కేజ్రీవాల్‌పై దాడికి యత్నం

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆప్ సీరియస్‌గా స్పందిస్తూ, ఇది సామాన్య దాడి కాదని, పధకం తోనే ఆసిడ్ దాడి అని ఆరోపించింది. అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకోవడంతో అరవింద్ కేజ్రీవాల్ ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. అక్కడే ఉన్న కార్యకర్తలు యువకుడిని పట్టుకుని చితకబాదారు.

Advertisements

అత‌డి వ‌ద్ద ఉన్న‌ బాటిల్‌ను పరిశీలించగా అందులో స్పిరిట్ ఉన్నట్లు తేలిందని ఆప్ నేతలు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీనికి ముందు కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు.

Related Posts
ఇరాన్ అణ్వాయుధ ప్లాంట్ లను ధ్వంసం చేయండి : ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన
Trump

వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు Read more

రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయింది: జగన్‌
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై Read more

మీ టికెట్ యాప్: బుకింగ్‌ సులభతరం
మీ టికెట్ యాప్: బుకింగ్‌ సులభతరం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ టికెట్ యాప్ పౌరులు, పర్యాటకులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి రూపొందించబడింది. మెట్రో, బస్సు ప్రయాణాలు, ఆలయ దర్శనాలు, పార్కుల Read more

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌..ఎందుకంటే..!
shamshabad airport red aler

జనవరి 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల Read more