thangalaan movie

ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్..

ఇటీవల ఓటీటీ ట్రెండ్ సినీప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో విజయం సాధించిన చాలా సినిమాలు నెల రోజులు కూడా గడవకముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు చేరుకుంటున్నాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం వివిధ కారణాల వల్ల ఆలస్యంగా మాత్రమే ఓటీటీలోకి వస్తున్నాయి. వాటిలో “తంగలాన్” ముఖ్యమైనది. సినీప్రియులు ఎప్పటినుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.తంగలాన్ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటనలేకుండానే నేరుగా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ చిత్రానికి ఆలస్యంగా ఓటీటీ రిలీజ్ కావడానికి ప్రధాన కారణం కోర్టు కేసులు మరియు నిర్మాణ సంస్థకు ఓటీటీలతో ఉన్న విభేదాలే. అయితే, గత నెలలో కోర్టు క్లియరెన్స్ రావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

చివరకు మంగళవారం ఉదయం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో మెప్పించారు.ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పార్వతి తిరువోతు కథానాయికగా కనిపించగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మాళవిక మోహనన్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. విక్రమ్ లుక్, యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కగా, జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం కథనం,నటన,సాంకేతిక అంశాల పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.తంగలాన్ కథ ఒక గిరిజన తెగ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటం చుట్టూ తిరుగుతుంది. అడవిలో దాగి ఉన్న బంగారు నిధిని వెలికితీయడానికి తంగలాన్ (విక్రమ్) యత్నిస్తాడు. కానీ ఆ నిధికి రక్షణగా ఉండే ఆరతి (మాళవిక మోహనన్) ఆయనకు ఎదురవుతుంది. ఆరతి అసలు ఎవరు? తంగలాన్ తన బృందంతో ఎలాంటివాళ్లనుఎదుర్కొన్నాడు? నిధిని పొందడంలో విజయం సాధించాడా? అనే అంశాలు ఆసక్తికరంగా నడుస్తాయి.యాక్షన్, థ్రిల్,ఎమోషన్‌ మేళవించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.సినిమా అభిమానుల కోసం పా రంజిత్ రూపొందించిన ఈఅద్భుతం ఓటీటీలో మరింత ప్రజాదరణ పొందుతుందనడంలో సందేహం లేదు.

Related Posts
బాలీవుడ్ పై అనురాగ్ కశ్యప్ తీవ్ర వ్యాఖ్యలు
బాలీవుడ్ పై అనురాగ్ కశ్యప్ తీవ్ర వ్యాఖ్యలు

ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలను, దానిలో సృజనాత్మకతకు కలిగిన అడ్డంకులను తీవ్రంగా విమర్శించారు. గతేడాది బాలీవుడ్ లో తనకు ఎదురైన Read more

నేను బతకడం కష్టమే అన్నారు..సోనాలి బింద్రే
Sonali Bendre

సోనాలి బింద్రే ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ కీలకమైన ఘట్టం గురించి తన అభిమానులతో భావోద్వేగంగా, సరళంగా మాట్లాడారు. ఆ కష్టకాలంలో ఉన్న అనుభవాలను పంచుకుంటూ Read more

నేను సింగిల్ అని చెప్పానా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది
keerthi suresh

ఇటీవల హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఓ కమెడియన్‌ను వివాహం చేసుకుందని, లేదా ఒక ప్రముఖ నిర్మాతతో పెళ్లి Read more

ఎస్‌డీటీ-18 ; చిత్రానికి ఎడిటర్‌గా మారి పోయిన నవీన్‌ విజయకృష్ణ .
naveen vijay krishna malli pelli social media naresh tollywood pavitra lokesh jpeg

సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ తనయుడు నవీన్ విజయకృష్ణ, ఇంతకు ముందు హీరోగా పలు చిత్రాల్లో అదృష్టాన్ని పరీక్షించినప్పటికీ, ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త ప్రయోగం చేసి Read more