ktr

ఎవరూ ఆందోళన చెందవద్దు: కేటీఆర్

తనపై నమోదైన ఫార్ములా ఈ-రేస్ కేసు గురించి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇప్పటివి పెద్ద లెక్క కాదన్నారు.

ktr
ktr

మనకు ఏదో ఇబ్బంది ఉన్నది అన్నట్లుగా కొంతమంది మాట్లాడారని, కానీ నిజంగా మనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తనపై నమోదైనది ఓ లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసులో వారు చేసేదేమీ లేదన్నారు. కాబట్టి ఇబ్బంది ఉండదన్నారు. కేసులు అసలు సమస్యే కాదన్నారు.ఈ కేసుపై తాను పోరాడతానన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిడ్డగా, ఆయన తయారు చేసిన సైనికుడిగా ఎంతో ధైర్యంగా ఉంటానన్నారు.

Related Posts
ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీని ప్రారంభించిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
IDFC First Bank launched IDFC First Academy

భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి వేసిన ముందడుగు.. హైదరాబాద్ : డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉన్న సమగ్ర ఆర్థిక అక్షరాస్యతకార్యక్రమం అయిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీనిప్రారంభించినట్లు Read more

ఫ్యాషన్ ప్రపంచంలోకి ‘ద వన్ అండ్ వోన్లీ ’
'The One and Only' way into the world of iconic and today's latest fashion

ముంబయి : బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఇప్పటి వరకు తమ అత్యంత గొప్ప ఎడిషన్ ను విడుదల చేసింది. ఫ్యాషన్ కేవలం ప్రారంభం మాత్రమే అయిన Read more

ఏఐ సాంకేతికకు తెలంగాణ మద్దతు
Telangana support for AI technologies

హైదరాబాద్ : స్టార్టప్‌లు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయని, సామాజిక ప్రభావాన్ని పెంచే ఏఐ సొల్యూషన్స్‌కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, Read more

భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం
Bharti Airtel, Bajaj Finance strategic partnership

న్యూఢిల్లీ : భారతదేశపు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ మరియు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *