hydra అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, అల్కాపురిలోని కొన్ని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ‘మార్నింగ్ రాగా’ అపార్ట్ మెంట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన షట్టర్లను (దుకాణాలను) హైడ్రా నేడు తొలగించింది. ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది.
ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వున్న కట్టడాలను కూల్చివేస్తున సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్ట్ హైడ్రా కూల్చివేతపై నిబంధనలు పాటించాలని పెర్కొంది.

Advertisements

Related Posts
సన్‌ఫ్లవర్ రైతుల కష్టాలు పట్టవా? – హరీశ్ రావు బహిరంగ లేఖ
harish Rao Letter to CM

తెలంగాణ రాష్ట్రంలో సన్‌ఫ్లవర్ రైతుల పరిస్థితిపై గంభీరంగా స్పందిస్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆయన Read more

స్థానిక సంస్థల ఎన్నికలు కేసీఆర్ అలర్ట్ ….
kcr and revanthreddy

ప్రజల్లో తన బలం నిరూపించుకునేందుకు రేవంత్ స్థానిక సంస్థల ఎ న్నికలకు సిద్దం అవుతున్నారు. కుల గణన పూర్తి చేయటం తమ భారీ సక్సెస్ గా ప్రభుత్వం Read more

Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేరెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, పిడుగులు ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు Read more

బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు..దుర్మార్గమైన చర్య: హరీశ్‌ రావు
Government is fully responsible for this incident: Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు. ఈ క్రమంలోనే Read more

×