ktr

అప్పులపై అవాస్తవాలు: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధ నడుస్తున్నది. తెలంగాణ అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్దేశపూర్తంగా తప్పుడు సమాచారం ఇచ్చారని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇస్తున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.
సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరూపించింది. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ.3,89,673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. అందువల్ల తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్థిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ వెల్లడించారు.

Advertisements
Related Posts
HCU : గ్రీన్ మర్డర్ చేస్తున్నారు – కేటీఆర్
HCU

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాంతం హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లా Read more

యూజీ సిలబస్ ను సవరించిన టీజీసీహెచ్ఈ
యూజీ సిలబస్ ను సవరించిన టీజీసీహెచ్ఈ

రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిజిసిహెచ్ఇ) యుజి సిలబస్ను పునరుద్ధరించడం, ఇంటర్న్షిప్లను ప్రారంభించడం వంటి కీలక కార్యక్రమాలను ప్రకటించింది. Read more

బాత్రూమ్‌లో కెమెరా: 2 అరెస్టులు, 7 పై కేసు
బాత్రూమ్‌లో కెమెరా: 2 అరెస్టులు, 7 పై కేసు

హైదరాబాద్ సమీపంలో ఉన్న మేడ్చల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కొంతమంది మహిళా విద్యార్థులు వంట సిబ్బంది హాస్టల్ వాష్రూమ్‌లలో వీడియోలు రికార్డు చేసినట్లు ఆరోపణలు చేసిన అనంతరం, Read more

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..!
sabarimalarailways1

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..! గుంతకల్లు రైల్వే, డిసెంబరు 10, ప్రభాతవార్త కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వాముల వారి దర్శనార్థం తెలుగు Read more

×