YCP: కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జడ్పీ ఛైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమయింది. అయితే యాభై జడ్పీటీసీ స్థానాల్లో నలభై మందికి పైగానే వైసీపీకి చెందిన జడ్పీటీసీలు ఉన్నారు. టీడీపీకి పదిమందికి మించి లేరు. దీంతో ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమషన్ నిర్ణయించడంతో వైసీపీ తమ పార్టీకి చెందిన జడ్పీటీసీలను క్యాంప్ నకు తరలించారు. అయితే తమ గెలుపునకు అవసరమైన బలం లేకపోవడంతో టీడీపీ ఈ ఎన్నికలో పోటీకి దింపలేదు. దీంతో వైసీపీ ప్రకటించిన గోవిందరెడ్డి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.

తాము జడ్పీ చైర్మన్ రేస్‌లొ లేమని టీడీపీ ప్రకటన
అయితే, టీడీపీ తాము జడ్పీ చైర్మన్ రేస్‌లొ లేమని అధికారికంగా ప్రకటించింది. ఇక, బ్రహ్మంగారిమఠం మండలం జెడ్పీటీసీ రామ గోవిందరెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ రేసులో లేకుంటే జెడ్పీటీసీ రామ గోవింద రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావడం ఇక లాంచనమే. కాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల పరిషత్ లలో కూడా వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. అక్కడ కూడా వైసీపీ నిర్ణయించిన అభ్యర్థులే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.. ప్రొద్దుటూరులో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగునున్నాయి. టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇక, కడప జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జెడ్పీటీసీలు అందరు క్యాంప్లో ఉన్నారు. సభ్యులకు వైసీపీ విప్ జారీ చేసింది. హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్నారు వైసీపీ జడ్పిటిసిలు.. గత నాలుగు రోజులుగా క్యాంపులో ఉన్నారు. జిల్లా పరిషత్తులో వైసీపీ సంపూర్ణ మెజార్టీ.. 50 మంది జెడ్పీటీసీలకు గాను వైసీపీలో 38 మంది జెడ్పీటీసీలు ఉన్నారు.