YSR Congress Party : కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.విశాఖ మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.దీంతో నగర పాలక సంస్థలో బలపరీక్ష తప్పనిసరి అయింది. మేయర్ పదవి దక్కించుకోవాలంటే కూటమికి 64 ఓట్లు అవసరం.ప్రస్తుత బలం చూస్తే మరో నలుగురు కార్పొరేటర్లు మారితే విజయం సాధించగలరు.అయితే విజయం తమదేనని విశాఖ డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు.విపక్షానికి వెళ్ళిన వారంతా తిరిగి తమ పార్టీకే వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జగన్, బొత్స, అమర్నాథ్ అండతో బలపరీక్షలో తాము పైచేయి సాధిస్తామని తెలిపారు. ఇదే పరిస్థితి కడప జిల్లా పరిషత్‌లోనూ నెలకొంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక మార్చి 27న జరగనుంది.ఈ నేపథ్యంలో వైసీపీ క్యాంపు రాజకీయాలను ముమ్మరం చేసింది. తమ వర్గంలో ఉన్న కార్పొరేటర్లను, జెడ్పీ మెంబర్లను మరింత దృఢంగా కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. కొందరిని ఊటీకి మరికొందరిని బెంగళూరుకు తరలించినట్టు సమాచారం. దీంతో పాటు, పలువురు కుటుంబ సమేతంగా క్యాంప్‌కు తరలినట్టు తెలుస్తోంది. రాజకీయ ఉత్కంఠ మరింత పెరుగుతోంది.