కిరణ్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన షర్మిల

YS Sharmila: కిరణ్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన షర్మిల

వైఎస్ భారతి రెడ్డిపై టీడీపీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఇదే అంశంపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Advertisements
ys sharmila apcc chief 610804a850 V jpg 625x351 4g

షర్మిల స్పందన

ఒక మహిళపై అసభ్య వ్యాఖ్యలు చేయడమే కాదు, కుటుంబ విలువలను నాశనం చేసేలా సోషల్ మీడియాలో చెలరేగుతున్న ఈ దుష్ట ప్రచారంపై షర్మిల స్పందిస్తూ, “ఇలాంటి వ్యక్తుల్ని నడిరోడ్డుపైనే ఉరి తీయాలి” అని ఆవేశంగా పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, మానవతా విలువలపై దాడిగా తీసుకోవాలి అని ఆమె అభిప్రాయం. పార్టీల్లో నాయకత్వ స్థాయిలో ఉన్నవారు స్వయంగా అసభ్యమైన వ్యాఖ్యలకు స్పందించకపోవడం వల్లే ఈ సంస్కృతి బలపడుతోందని ఆమె ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకు ఏ పార్టీ ప్రోత్సాహం ఇవ్వకూడదు. వారు ఎంతటి వారైనా శిక్షించాలి అంటూ స్పష్టంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నా” ఏకపక్షంగా విమర్శించడం కాదు, సాటి మహిళగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం కోరుతున్నానని షర్మిల పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. మహిళలను దూషించే అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికీ, సమాజానికీ బాధ్యత ఉందని అన్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న వికార పోస్టులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. “రేటింగ్స్ కోసం అసత్య ప్రచారాలు చేసే యూట్యూబ్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛ అన్నదే ఉంది, కానీ అది బాధ్యతలతో పాటు ఉండాలి,” అని ఆమె వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా బాధ్యతలపై ప్రబోధం

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న వికార పోస్టులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రేటింగ్స్ కోసం అసత్య ప్రచారాలు చేసే యూట్యూబ్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛ అన్నదే ఉంది, కానీ అది బాధ్యతలతో పాటు ఉండాలి, అని ఆమె వ్యాఖ్యానించారు. రక్త సంబంధం, కుటుంబ జీవితం, పిల్లలపై కూడా విమర్శలు చేయడం ఎంతటి దిగజారుదల కీడని ఈ సందర్భంలో స్పష్టమవుతోంది. అన్యాయం పున్యం తేడా లేకుండా వ్యవహరించే ఈ ‘కాలకేయ సంస్కృతి’ అంతం కావాలి అని షర్మిల తేల్చిచెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదికి లాగారు మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు అన్యం పున్యం ఎరుగని పసిపిల్లలను సైతం లాగారు అక్రమ సంబంధాలు అంటగట్టారు.  మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి అని షర్మిల పేర్కొన్నారు.

TTD: గోశాల‌లో గోవుల మృతిపై టీటీడీ వివరణ

Related Posts
ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi will visit Gujarat today and tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని Read more

రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు..ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
CBN AP Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధ తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమను పట్టించుకోని పిల్లలు లేదా వారసులపై తల్లిదండ్రులు చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం Read more

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్.. !
BRS leader Errolla Srinivas arrested.

హైదరాబాద్‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కేసు Read more

Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు?
Caller ID ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు

Caller ID : ఇంటర్‌నెట్‌వర్క్ కాలర్ ఐడీ సేవలు ఎప్పుడు? సెల్‌ఫోన్ వినియోగదారులకు త్వరలోనే స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టే ‘సీఎన్‌ఏపీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టెలికామ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×