YS Sharmila key comments on the death of Pastor Praveen Pagadala

Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై షర్మిల కీలక వ్యాఖ్యలు

Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై

వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలి

ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతి పై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

పగడాల శరీరంపై గాయాలు

కాగా, క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ.. ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
Ponnam Prabhakar: ప్రతిపక్షానికి కనీస బాధ్యత కూడా లేదు : మంత్రి పొన్నం
opposition does not even have the slightest responsibility .. Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని Read more

భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం
భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం

భారత్, ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపనపై మంగళవారం అధికారికంగా ఒప్పందం మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ Read more

మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు
మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్

మెల్బోర్న్‌లో సెంచరీ చేసిన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి: తండ్రి ఆనందం మెల్బోర్న్‌లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో భారత ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి Read more

రథసప్తమి వేడుకలకు జాగ్రత్తలు తీసుకుంటున్న టీటీడీ
తిరుమల రథసప్తమి వేడుకలకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్న టీటీడీ

తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *