ys sharmila asked cm chandrababu to pay the pending dues of aarogyasri

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల

అమరావతి: పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకం. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చింది. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది అని షర్మిల ఫైర్‌ అయ్యారు.

Advertisements
image
image

ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉంది. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలి అని వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు.

వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలంటూ చంద్రబాబుు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తోన్నామని షర్మిల చెప్పారు. పెండింగ్ బకాయిలు 3,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని అన్నారు.

Related Posts
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..
pawan paul

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. పవన్ పై 14 Read more

పసిడి దిగుమతుల ఆల్ టైమ్ రికార్డ్
GoldNov

భారత లో పసిడి దిగుమతులు నవంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నవంబర్ లో 14.8 బిలియన్ డాలర్ల పసిడి దిగుమతులు నమోదు కావడం గమనార్హం. కానీ Read more

దేవర 11 డేస్ కలెక్షన్స్
devara 11 day

ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను Read more

నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి
mumbai boat accident

ముంబై తీరంలో జరిగిన దారుణ బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కలచివేస్తోంది. నీల్కమల్ ఫెర్రీ బోటు ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే అని Read more