భారత యువ వెయిట్‌లిఫ్టర్ రెడ్డి భవాని (Reddy Bhavani) అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్ పతాకాన్ని ఎగురవేసింది. కజకిస్థాన్ వేదికగా ఇటీవల ముగిసిన ఏషియన్ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవాని రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకొని దేశగౌరవాన్ని మరింత పెంచింది. ఈ విజయం ఆమెకే కాక, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచింది.భవాని స్నాచ్ విభాగంలో (snatch section) 69 కిలోలు, అలాగే క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 90 కిలోలు లిఫ్ట్ చేస్తూ రెండింటిలోనూ బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఆమె క్రీడా రంగంలో సత్తా చాటింది. ఓ యువతిగా అంతర్జాతీయ వేదికపై ఇలా వెలుగు వెలగడం నిజంగా ప్రేరణగా నిలుస్తోంది.విజయనగరం జిల్లా, మండలం కొండకరకం గ్రామానికి చెందిన రెడ్డి భవాని అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. భవాని తండ్రి రెడ్డి ఆదినారయణ (Reddy Adi Narayana) తాపీ మేస్త్రీ. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, మొదటి అమ్మాయి పెళ్లి కోసం ఉన్న ఇళ్లు కూడా అమ్మేసాడు.
ఎక్స్ వేదికగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు
అయినా వెనకడుగు వేయకుండా రెండో కుమార్తె భవానికి వెయిట్ లిఫ్టింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించారు. అందరి ప్రోత్సాహంతో రెడ్డి భవాని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది.ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ (YS Jagan), ఎక్స్ వేదికగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ‘ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి భవానికి హృదయపూర్వక అభినందనలు. మరిన్ని మైలురాళ్లు, చిరస్మరణీయ విజయాలు ఆమెకు దక్కాలని కోరుకుంటున్నా. భవాని, ఇలాగే విజయాలతో మెరుస్తూ ఉండాలి.’అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Read hindi news:
Read Also: Quantum Valley: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి చెందిన నేత.
ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నవ ముఖ్యమంత్రి?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రి.అయితే, ఇది ఏకీకృత ఆంధ్రప్రదేశ్, విభజన అనంతర రాష్ట్రాన్ని కలిపి లెక్కించితే 17వ ముఖ్యమంత్రి అవుతారు.
విభజన అనంతర (2014 తర్వాత) ఆంధ్రప్రదేశ్‌లో ఆయన 2వ ముఖ్యమంత్రి.