YS Jagan visit to Raptadu constituency

YS Jagan : రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన

YS Jagan: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం, పాపిరెడ్డి పల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో రాప్తాడుకు రానున్నారు. లింగమయ్య హత్య తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల మధ్య వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisements
రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటన

మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డిని పాపిరెడ్డిపల్లికి రానివ్వకుండా అడ్డుకునే దమ్ము, ధైర్యం రెండూ మాకున్నాయి అని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వైసీపీ అధినేత జగన్‌ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు రావడంపై స్పందించారు. మాలో ఉన్నది చంద్రబాబు, టీడీపీ రక్తం. రాప్తాడు నియోజకవర్గంలో జగన్‌ పర్యటనపై మా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు జగన్‌ కుటుంబం అడ్డుకుంది. అందుకే జగన్‌రెడ్డిని అడ్డుకోవాలనే అభిప్రాయం మా పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.

ఏదైనా సాయం చేసిపోవాలి.. ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దు

అయితే మా నాయకుడు చంద్రబాబు అలాంటి సంస్కృతిని మాకు నేర్పలేదు. ఒక చావును రాజకీయం చేసేందుకు జగన్‌రెడ్డి వస్తున్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనను ఫ్యాక్షన్‌ హత్యగా చిత్రీకరించి, తోపుదుర్తి సోదరులు రాజకీయం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక మాజీ సీఎం ఇక్కడకు రావడం సరైంది కాదు. జగన్‌ వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఏదైనా సాయం చేసిపోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇక్కడ ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దు. బీసీల మీద జగన్‌కు అంత ప్రేమే ఉంటే రాప్తాడు ఇన్‌చార్జిగా ఒక బీసీని నియమించాలి అన్నారు.

Read Also: ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం

Related Posts
భారతదేశంలో ఎరువుల ఆవిష్కరణకు కోరమాండల్ – ఐఎఫ్‌డీసీ భాగస్వామ్యం
Coromandel - IFDC Partnership for Fertilizer Innovation in India

భారత వ్యవసాయ రంగంలో ఎరువుల ఆవిష్కరణకు మరింత ఊతమిచ్చేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్ డెవలప్‌మెంట్ సెంటర్ (IFDC) వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. డిసెంబర్ Read more

Donald Tariff: మేక్ అమెరికా వెల్తీ అగైన్ కోసమే టారిఫ్ అంటున్న ట్రంప్
మేక్ అమెరికా వెల్తీ అగైన్ కోసమే టారిఫ్ అంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి కొరడా ఝుళింపించారు. అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు. భారీగా టారిఫ్‌ను పెంచారు. ఈ జాబితాలో భారత్ సైతం Read more

Gold : RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో వడ్డీ రేట్లు తగ్గే లోన్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన భద్రతా పెట్టుబడుల భాగంగా బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటోంది. తాజా లెక్కల ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI Read more

Donald Trump: 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?
25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 25 శాతం సుంకం విధించాలని డోనల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రయోజనం పొందే అవకాశం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×