NTR medical services to resume in AP from today

Aarogyasri Services : ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం

Aarogyasri Services : ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్య శ్రీ సేవలు) నేటి నుంచి యథాతథంగా కొనసాగనున్నాయి. బకాయిలు రూ. 500 కోట్ల తక్షణం విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు మంగళవారం నుంచి ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆశా కార్యవర్గం సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆషా టీం ప్రకటించింది.

Advertisements
ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్

సీఎంతో ఫలించిన చర్చలు

ఎన్టీఆర్ వైద్య సేవ కింద క్యాష్‌లెస్ సేవలు పునఃప్రారంభం అవుతాయని, ఆప‌త్‌కాల సమావేశంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు ఫలించాయని ఆషా టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. బిల్లులు వేల కోట్లు బకాయి ఉండటంతో నెట్ వర్క్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడం కుదరంటూ మెడికల్ సర్వీసెస్ నిలిపివేశాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అత్యవసర పరిస్థితిగా గుర్తించారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలోనూ సోమవారం నాడు ఆశా కార్యవర్గం‌తో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు.

500 కోట్లు విడుదలకు చంద్రబాబు ఆమోదం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, అయినా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల పాత్రను గౌరవిస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెండింగ్ బకాయిలు చెల్లింపులలో భాగంగా వెంటనే రూ. 500 కోట్లు విడుదల చేయడానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. మిగిలిన పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలోనే మరో సమావేశాన్ని నిర్వహించి ఎన్టీఆర్ వైద్యసేవలపై ఇతర అంశాలపై చర్చిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆషా సంఘం తెలిపింది.

Read Also : బనకచర్ల ప్రాజెక్ట్‌ వివరాలను దాస్తున్న ఏపీ!

Related Posts
TG-TET Notification : టెట్ నోటిఫికేషన్ విడుదల
TS TET Notification2

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పాఠశాల విద్యాశాఖ తాజాగా టెట్ (తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారికంగా Read more

గూగుల్ తో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం
Telangana Govt. and Google

తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు అగ్ర సంస్థలు పరుగులుపెడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా..తాజాగా గూగుల్ ..తెలంగాణ సర్కార్ తో కీలక Read more

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
Nampally court

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ Read more

త‌ల్లితో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌
jagan2

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాలుగు రోజుల క‌డప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో జరిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×