young woman who was killed

Chittoor Dist : ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 నెలలకే దారుణం

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాజీ నగర్‌కు చెందిన యువతి యాస్మిన్ భాను అనుమానాస్పదంగా మృతి చెందింది. మొదట ఇది ఆత్మహత్యగా భావించగా, పోలీసులకు ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాస్మిన్ భాను వేరే మతానికి, వేరే సామాజిక వర్గానికి చెందిన సాయితేజ్ అనే యువకుడిని ప్రేమించి పెద్దలను ఎదిరించి ఈ ఏడాది ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే ఆమె మృతి చెందడం చిత్తూరు వాసుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.

Advertisements

ఇది ఖచ్చితంగా ప్రూవ్ హత్యానే

పెళ్లి తర్వాత భర్తతో వేరిగా జీవిస్తున్న యాస్మిన్.. తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రావడంతో ఆదివారం పుట్టింటికి వెళ్లింది. అదే రోజు ఆమె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే యాస్మిన్ భాను భర్త సాయితేజ్ వాదన మేరకు ఇది హత్య గా భావిస్తున్నారు. తన భార్యను నవ్వుతూ పంపించానని, మరుసటి రోజు ఆమె మృతదేహాన్ని మార్చురీలో చూపించారని ఆయన వాపోయారు. అంతేకాకుండా, పెళ్లి తర్వాత తమకు ప్రాణహాని ఉందని అప్పటికే వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, రక్షణ కూడా కోరిన విషయం వెలుగులోకి వచ్చింది.

తండ్రి , మేనల్లుడు పరారీ

ఈ ఘటనలో ప్రధాన అనుమానితులైన యాస్మిన్ తండ్రి షౌకత్ అలీ, అతడి మేనల్లుడు లాలూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యాస్మిన్ మృతి ఒక పరువు హత్యే అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. సాయితేజ్ మాత్రం తన భార్యకు న్యాయం జరగాలని, బాధితులకు కఠిన శిక్షలు పడాలని కోరుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Related Posts
పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. Read more

విజయవాడ మెట్రో రైలు: కల సాకారానికి తొలి అడుగు
విజయవాడ మెట్రో రైలు: కల సాకారానికి తొలి అడుగు

విజయవాడ నగర వాసుల మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన Read more

27న తెలంగాణకు రాహుల్ గాంధీ, ఖర్గే రాక ..!
Rahul Gandhi and Kharge will arrive in Telangana on 27th.

హైదరాబాద్‌: ఈనెల 27న కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 Read more

సీఎం రేవంత్ కు రాహుల్ ఫోన్
rahul phone

తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×