భారత క్రికెట్‌లో వేగం, ఫిట్నెస్ అనేవి ముఖ్యమైన అంశాలుగా మారిన ఈ రోజుల్లో, అదే ఫిట్నెస్ ప్రాక్టీసులు క్రీడాకారుల (Practices of athletes) పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయా? అన్న చర్చ చెలరేగుతోంది. ఈ చర్చకు నాంది పలికిన వ్యక్తి, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yograj Singh) తండ్రి, ప్రముఖ క్రికెట్ కోచ్ యోగ్‌రాజ్ సింగ్.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన టీమిండియా ఫాస్ట్ బౌలర్ల తరచూ గాయపడటంపై గట్టిగా స్పందించారు. ప్రత్యేకంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తరచూ గాయాలపాలవ్వడానికి కారణాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “బుమ్రా కేవలం రెండు మూడు గాయాలకే కాదు, గత కొన్ని సీజన్లలో అనేక సార్లు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దీని వెనుక ప్రధాన కారణం అతని జిమ్ అలవాట్లు, బాడీ బిల్డింగ్‌పై చూపుతున్న అత్యధిక శ్రద్ధ” అని ఆయన వ్యాఖ్యానించారు.

బుమ్రా వంటి కీలక బౌలర్లు
శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి జిమ్‌లకు బదులుగా సాంప్రదాయ వ్యాయామ పద్ధతులను అనుసరించాలని యోగ్‌రాజ్ సూచించారు. “ఫాస్ట్ బౌలర్లు యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. ఇవి శరీరాన్ని సహజంగా బలోపేతం చేస్తాయి. కండరాలను దృఢంగా మార్చి, గాయాల ముప్పును తగ్గిస్తాయి” అని ఆయన వివరించారు. బుమ్రా వంటి కీలక బౌలర్లు తమ ఫిట్‌నెస్ (Fitness) ను జిమ్‌లలో కాకుండా సహజ సిద్ధమైన మార్గాల్లో పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
బుమ్రాతో పాటు మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్య వంటి కీలక ఆటగాళ్లు కూడా తరచూ గాయాలతో జట్టుకు దూరం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగ్‌రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు గాయాల (World-class bowlers injured) బెడద లేకుండా ఉంటే భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: