హైదరాబాద్ : యువతకు ఉపాధి కల్పనకే యంగ్ ఇండియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU) ఏర్పాటు చేసింది. స్కిల్ యూనివర్సిటీ స్థాపించి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
యువతకు కాలేజీ చదువులు ముగిసిన వెంటనే ప్రైవేట్ రంగంలో కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్స్ లేకపోవడంతో ఉద్యోగాలు రావడం కష్టతరంగా మారింది. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతలో స్కిల్స్ పెంపోదించేందుకు 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీని ప్రభుత్వం నిర్మిస్తున్నది. ప్రైవేట్ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ పరిశ్రమల శాఖ రూపొందించింది. ఫార్మా, నిర్మాణం, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్, ఎఫెక్ట్స్, గేమింగ్ తదితరాల్లో విద్యార్థులకు ఏడాది కాలంలో ఇక్కడ శిక్షణ ఇచ్చారని సిఎం కార్యాలయం తెలిపింది.
ఎంటర్ప్రెన్యూర్షిప్లో బిబిఏ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది. ఎఐ ఆధా రిత వర్చువల్ యూని వర్సిటీ మరో రెండు నెలల్లో ప్రారంభిస్తారని పేర్కొంది. ఏడాదిగా తాత్కా లిక క్యాంపస్ నుంచి పనిచేస్తున్న యూనివర్సిటీ నుంచి 507 మంది విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందారు. స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన 416 మంది అభ్యర్థులు ఇప్పటికే ఉద్యోగాలు పొందారు. వీటిలో 82శాతం మందికి ఇప్పటికే వివిధ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లు పొందారు. తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఆదానీ, రెడ్డి ల్యాబ్స్, మహేంద్ర, ప్లిప్కార్డ్, జిఎంఆర్, హెచ్ఎస్బీ, ఆపోలో వంటి కార్పొరేట్ కంపెనీలు భాగస్వా ములుగా ఇందులో ఉంటాయి.

ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణా ళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మందికి నైపుణ్య కోర్సులను అందిం చేందుకు స్కిల్ యూనివర్సిటీ మరిన్ని ప్రణాళికలు రూపొంది స్తోంది. కేవలం యూనివర్సిటీలో కొందరికి శిక్షణ ఇస్తేనే సరిపోదని, భారీగా విద్యార్థులు ఉండే డిగ్రీ కాలేజీలు కేంద్రంగా నైపుణ్య కోర్సులను అందించాలని భావిస్తోంది. తొలి దశలో యుజిసి స్వయంప్రతిపత్తి హోదా పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజాల్లో 2నుంచి 6 నెలల కాల వ్యవధి ఉన్న సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఐ)తో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉద్యోగాలకు అర్హత సాధించే విధంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం చేసుకున్నారు.
సిఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం గత జనవరిలో సింగపూర్ పర్యటన సందర్భంగా ఈ ఎంఓయు కుదిరింది. సింగపూర్ ఐటీఈ టెన్త్ విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత వరకు, అలాగే ఆసక్తి ఉన్న ఏ వయస్సు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో ఉద్యోగానికి సిద్దమయ్యేలా శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థలో ప్రస్తుతం 28వేల మంది శిక్షణ పొందుతున్నారు. ఇదే స్పూర్తితో ఏర్పాటైన స్కిల్ యూనివర్సిటీలో యువతకు సింగపూర్ ఐటీఐతో శిక్షణను ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకోవడం మన యువత నైపుణ్యాభివృద్దికి మరింత సహకారం లభిస్తుంది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో స్కిల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం అయ్యేందుకు అనేక పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వచ్చే ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని, యూనివర్సి టీకి ముచ్చెర్లలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటు లోకి వస్తే, ఏడాదికి 30వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్కిల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ స్కిల్స్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయిమెంట్ రెడీనెస్ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఎంవీఎస్ ప్రభుత్వ డిట్రీ కాలేజీ, ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్, జడ్చర్లలోని బిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కొడంగల్లో ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లను ఇందుకోసం ఎంపిక చేశారు. ఇక్కడి విద్యార్థులకు మార్కెట్లోని పోటని తట్టుకొని ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకునే విధంగా ఇంగ్లీష్, ఇతర నైపుణ్య అంశాల్లో శిక్షణ ఇస్తారు.
READ MORE :