Yadagirigutta Devasthanam Board on the lines of TTD

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సిద్ధమైన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామక నిబంధనలపై సీఎం తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

తిరుమల ఆలయంతో సమానంగా, యాదగిరిగుట్ట ఆలయం పరిసరాల్లో రాజకీయప్రభావం లేకుండా చూడాలని, ఆలయపవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధర్మకర్తలమండలి నియామకం అలాగే ఆలయం తరఫున నిర్వహించాల్సిన ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలకు సంబంధించి ముసాయిదా నిబంధనల్లో ముఖ్యమంత్రి పలు మార్పులను సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

image

కాగా, తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయ అభివృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఆలయానికి వచ్చే నిధులు, కానుకల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట ఆలయంతో పాటుగా.. అనుబంధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వంపై ఆధారపడకుండా.. బోర్డు ద్వారానే డెవలప్‌మెంట్ పనులు చేయనున్నారు. భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటివి అందుబాటులోకి వస్తాయి.

Related Posts
చంద్రబాబు కు రాహుల్ గాంధీ ఫోన్..
rahul cbn

ఏపీ సీఎం చంద్రబాబు కు కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్ చేసారు. చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి మృతితో తీవ్ర విషాదంలో Read more

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి
Rudrabhishekam Pooja

హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది.సృష్టి, స్థితి, లయకారుడైన శివునికి ఈ వ్రతం అంకితం చేయబడింది.ప్రత్యేకంగా శనివారం నాడు వచ్చే ప్రదోష వ్రతాన్ని"శని ప్రదోష Read more

26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా – రేవంత్
cm revanth reddy district tour

జిల్లా కలెక్టర్లతో సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రతి పథకాన్ని అమలు చేసే తీరును సమీక్షించాలని, ప్రభుత్వం నిష్క్రమంగా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత Read more

అదానీ అంశం.. లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి ఎంపీల నిరసన
Adani topic. Opposition India Alliance MPs protest in Lok Sabha

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా విపక్షాలు ఆందోళనకు దిగారు. గౌతమ్‌ అదానీ వ్యవహారంపై చర్చకు ఇండియా కూటమి ఎంపీలు Read more