డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో అరుంధతి రెడ్డి సమయోచిత షాట్‌తో ఢిల్లీ గెలుపును ఖరారు చేసింది.
ముంబై ఇండియన్స్ ఆరంభం:
వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. నాట్ సీవర్ బ్రంట్ (80 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42) మెరుపులతో జట్టు శుభారంభం చేసుకుంది.10.4 ఓవర్లలో 105/2తో నిలిచింది 200 పైచిలుకు స్కోరు నమోదు చేసేలా కనిపించింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుస ఓవర్లలో ముంబై బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు ఓ పక్క నాట్ సీవర్ బ్రంట్ నిలబడ్డా ఆమెకు సహకరించేవారు లేకుండా పోయారు. దీంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2, క్యాప్సీ 1, మిన్ను మని 1 వికెట్ పడగొట్టారు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్ షఫాలీ వర్మ (18 బంతుల్లో 43) ఫోర్లు, సిక్సర్లతో ఆకట్టుకుంది. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 60/0తో కదలింది. పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టింది. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే ముగిసే సరికి 60/0తో నిలిచింది. 18 బంతుల్లో 43 రన్స్ చేశాక షఫాలీ ఔటైన తర్వాత ఢిల్లీ స్కోరు మందగించింది. ఈ దశలో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించింది. నికీ ప్రసాద్& సారా బ్రైస్ శ్రమించడంతో మ్యాచ్ మళ్లీ ఆసక్తికరంగా మారింది. కానీ ఇటీవల భారత మహిళల జట్టుకు అండర్ 19 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35 రన్స్), సారా సారా బ్రైస్ (10 బంతుల్లో 21 రన్స్) పోరాడారు. దీంతో ఢిల్లీ పోటీలోకి వచ్చింది. ఇక ఢిల్లీకి చివరి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. దీంతో సమీకరణం 7 బంతుల్లో 16 పరుగులకు మారింది. ఈ దశలో ముంబైకే విజయావకాశాలు ఉన్నాయి. చివరి బంతికి 2 పరుగులు అవసరమైన దశలో అరుంధతి రెడ్డి డైవ్‌తో క్రీజ్ దాటడం ఢిల్లీ గెలుపును ఖరారు చేసింది.
అరుంధతి రెడ్డి – ఢిల్లీ విజయ గీతం:
చివరి బంతికి హైదరాబాద్‌కు చెందిన అరుంధతి రెడ్డి షాట్ ఆడింది. ఆమె రెండు పరుగులు తీయడానికి యత్నించగా, రెండో పరుగు ప్రయత్నంలో వికెట్ కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్ రీప్లేను పరిశీలించగా అరుంధతి కొద్ది క్షణాల వ్యవధిలోనే క్రీజు దాటినట్లు తేలింది. దీంతో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. విడుదలైన ఆనందం – నిరాశలో ముంబై ,ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో జట్టు సభ్యులు ఆనందంలో మునిగిపోగా, ముంబై ఇండియన్స్ ఆఖరి క్షణాల్లో ఓటమిపాలై నిరాశకు గురైంది.