హంగేరీలో ‘మెట్రోపొల్’ (Metropol’ in Hungary) అనే ప్రభుత్వ అనుకూల పత్రిక ప్రచురించిన కొన్ని ఫోటోలు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ద షార్టర్,(The Shorter) ది బెటర్ అనే శీర్షికతో, అనుమతి లేకుండా మహిళల ఫోటోలు ప్రచురించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీధుల్లో, సబ్వేల్లో తీసిన ఫోటోలు పత్రికలో నిలిచాయి. ఫ్యాషన్‌ను చూపించాలన్న ఉద్దేశంతో చేశామని చెప్పినా, ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేనని విమర్శలు వెల్లువెత్తాయి.ఫోటోలకు జత చేసిన శీర్షిక, ఎంత పొట్టిగా ఉంటే అంత మేలు, అనేది మహిళలపై లైంగిక దృష్టికోణాన్ని ప్రోత్సహించడమేనంటూ విమర్శలు వెల్లుతున్నాయి. పాఠకులు కూడా ఇలాంటి ఫోటోలు పంపాలంటూ పత్రిక ఆహ్వానించడం, మహిళలను వస్తువుల్లా చూపించే ప్రయత్నమేనని సమాజంలోని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం గోప్యత భంగమే కాకుండా, లైంగిక వేధింపుల తీరును ప్రోత్సహించడమే అని స్పష్టమవుతోంది.
మహిళా హక్కుల కోసం శబ్దించిన నిరసనలు
పత్రిక తీరుపై హంగేరీలో మహిళా హక్కుల కార్యకర్తలు, పౌర సమాజం గళమెత్తారు. ‘నా శరీరం వస్తువు కాదు’, ‘జర్నలిజం అంటే వేధింపులు కాదు’ అంటూ 50-60 మంది నిరసనకారులు పత్రిక కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. వారు పత్రిక బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పేటెంట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండన
పౌర హక్కుల సంస్థ ‘పేటెంట్ అసోసియేషన్’ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది మహిళలను వేషధారణ ఆధారంగా దౌర్జన్యంగా చూపించడమేనని, నోటీసు ఇవ్వకుండా ఫోటోలు ప్రచురించడం లైంగిక వివక్షకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొంది. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.
బాధితురాలి బాధ… సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాల
ఓ బాధితురాలు తన అనుమతి లేకుండా తీసిన ఫోటో చూసి ఆశ్చర్యపోయినట్టు వెల్లడించారు. తన డ్రెస్ తన అభిరుచి, కానీ దాన్ని తప్పుగా చూపించడం సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రిక చర్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన వలె, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతలకు మీడియా గౌరవం ఇవ్వకపోతే, ప్రజల్లో మీడియా మీద నమ్మకం తగ్గిపోతుందన్న విషయం తథ్యమే. వార్తలకు విలువ ఉంటేనే, వాటికి విశ్వసనీయత ఉంటుంది.
Read Also : New Zealand: వేశ్యలతో పీఎంవో ఉద్యోగి ఫోన్ రికార్డింగ్