తెలంగాణలోని మహిళా స్వయం సహాయక (For women’s self-help groups) సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. గతంలో నిలిచిపోయిన వడ్డీ లేని రుణాలను తాజాగా విడుదల చేసింది. మొత్తం రూ.344 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మొత్తంలో రూ.300 కోట్లు గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలకు కేటాయించగా, రూ.44 కోట్లు పట్టణ మహిళలకు అందజేయనున్నారు. ఈ రుణాలను జూలై 13 నుంచి 18వ తేదీ వరకు సంబంధిత సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ప్రతి నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ
నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు కూడా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో వడ్డీ లేని రుణాలు పూర్తిగా తడిసి మోపెయ్ అయ్యాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. వాటిని చెల్లించకపోవడంతో మహిళా సంఘాలపై ఆర్ధిక భారం పెరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిష్కారానికి చర్యలు
రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వడ్డీ లేని రుణాల చెల్లింపుపై చర్యలు ప్రారంభించారు. మహిళా సంఘాలను పునరుజ్జీవింపజేసేందుకు తొలి ఘట్టంగా ఈ నిధులను విడుదల చేశారు.ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మహిళలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు ఇది పెద్ద దిక్సూచి కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ చర్య పెద్ద భరోసా కానుంది.
Read Also : Revanth Reddy : అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన రేవంత్