పశ్చిమ బెంగాల్‌లో (In West Bengal) ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. కానీ అతని చేతిలో ఓ తల ఉంది. మరోచేతిలో పదునైన కత్తి. ఇది చూసిన జనాలు షాక్‌తో పాటు భయంతో పరుగులు తీశారు.ఇది పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల బసంతి టౌన్‌లో జరిగింది. నిందితుడి పేరు బిమల్ మండల్ (Bimal Mandal) . బిమల్ తన వదినతో తరచూ గొడవలు పడ్డాడట. కుటుంబాలలో మనస్పర్థలు కొన్ని సార్లు పెద్ద కుదుపుగా మారతాయి. కానీ ఈసారి అది హింసాత్మకంగా ముగిసింది.శనివారం మరోసారి వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆగమనంతలోనే బిమల్ తన ఆత్మ నియంత్రణ కోల్పోయాడు. వెంటనే కత్తి తీసుకుని తన వదినపై దాడి చేశాడు. ఆమెను చంపాడు. అంతేకాదు, ఆమె తలను శరీరం నుంచి వేరు చేశాడు.

రోడ్డుపై నడుస్తూ.. చేతిలో తల, కత్తితో
బిమల్ తన నేరాన్ని దాచలేదు. తల ఒక చేతిలో, కత్తి మరోచేతిలో పట్టుకుని నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఈ దృశ్యం చూసిన ప్రజలు పూర్తిగా షాక్ అయ్యారు. కొందరు భయంతో పారిపోయారు. మరికొంత మంది వీడియోలు తీసేందుకు అతడ్ని ఫాలో అయ్యారు.
పోలీసులకు తలను అప్పగించి.. బిమల్ లొంగిపోయాడు
బిమల్ నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. తలను, కత్తిని అక్కడ ఉన్న పోలీసులకు అప్పగించాడు. నేనే చంపాను అని చెప్పి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మానవత్వం చనిపోయిందా?
ఈ సంఘటన ఒక్క పశ్చిమ బెంగాల్‌కే కాదు, మనమందరికీ ఒక హెచ్చరిక. కుటుంబ గొడవలు ఇలా హింసకు దారితీయడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
Read Also : Rinku Singh: ఈ నెల 8న ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం