unnamed file 1

క్రీయాశీలకంగా పార్టీలో పనిచేస్తే చంపేస్తారా ?..జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి అనుచరుడు మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై జీవన్ రెడ్డి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. గంగారెడ్డిని దారుణంగా హత్య చేయడంతో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.గంగారెడ్డి హత్యను నిరసిస్తూ తన అనుచరులతో కలిసి జగిత్యాల-ధర్మపురి రహదారిపై జీవన్‌ రెడ్డి ఆందోళనకు దిగారు.ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మాకు నలుగురికి సేవ చేయడమే తెలుసు.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం.. మానసికంగా అవమానాలకు గురవుతున్నా భరించాం.. కానీ ఇవాళ భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు.’అని కాంగ్రెస్ పార్టీని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు.తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీయాశీలకంగా పార్టీలో పనిచేస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. దీంతో జీవన్‌ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జీవన్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్‌ రెడ్డి మధ్యలోనే ఫోన్ కట్ చేశారు.

గంగారెడ్డిని చంపిన వారిని పట్టుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. ఇక రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై జీవన్‌ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జీవన్ రెడ్డికి సముచిత స్థానమే దక్కింది. అయితే ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తనకు ఎటువంటి సమాచారం లేకుండా తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీ చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచన కూడా చేశారు. ఇప్పుడు తన అనుచరుడనే హత్య చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు.

Related Posts
నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్..
Former minister Sailajanath joins YCP today

అమరావతి: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఈరోజు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం Read more

Revanth Reddy : ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై రేవంత్ కీలక ఆదేశాలు

Revanth Reddy : ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై రేవంత్ కీలక ఆదేశాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై నెల రోజులుగా కొనసాగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ పూర్తి విజయాన్ని Read more

‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం..గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా’ – కేటీఆర్
ktr revanth

రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎం రేవంత్ ఫై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. . 'ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం కు తెలంగాణ గల్లీల్లో Read more

మూడు బిల్లుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం
telangana Assembly speaker

ఎలాంటి చ‌ర్చలకు తావు లేకుండానే మూడు బిల్లుల‌కు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. విరామం అనంత‌రం ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ల‌గ‌చ‌ర్ల Read more