తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
(Prabhakar Rao)నేడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణకు హాజరవే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే ఆయన్ను విచారించేందుకు అవసరమైన ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు సమాచారం.
వివరాలపై లోతుగా విచారణ
విచారణ ప్రాథమిక దశలో ప్రారంభమైనా, ఇది సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కీలక అంశాలపై స్పష్టత రాబట్టేందుకు, అవసరమైతే రెండు మూడు రోజులు పాటు విచారణ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎలాంటి ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగిందన్న విషయాలపై లోతుగా అడిగే అవకాశం ఉంది.
15 నెలల తర్వాత ఇండియాకు వచ్చిన ప్రభాకర్
దాదాపు 15 నెలలుగా విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చారు. దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన, సిట్ విచారణకు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ప్రభాకర్ రాక, విచారణ దశలు కీలకంగా మారాయి.
Read Also : Amaravati : వాళ్లిద్దరికీ నోటీసులు ఇస్తాం – మహిళా కమిషన్