Will not declare a political heir while alive.. Mayawati

బతికున్నంత కాలం రాజకీయ వారసుడిని ప్రకటించను: మాయావతి

లక్నో: తాను బతికున్నంత వరకు తన వారసుడిని ప్రకటించనని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. పార్టీ అన్నింటి కంటే అత్యున్నతమైనదని, ఆ తర్వాతే ఏ సంబంధాలైనా వస్తాయని ఆమె తెలిపారు. తన సోదరులు ఆనంద్‌ కుమార్‌, రామ్‌జీ గౌతంలను పార్టీ జాతీయ సమన్వయకర్తలుగా ఆమె నియమించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు, పార్టీలో ముఠా కక్షలకు పాల్పడినందుకు తన మామ అశోక్‌ సిద్ధార్థ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. అతడు ఆకాశ్‌ ఆనంద్‌ రాజకీయ కెరీర్‌ను నాశనం చేశాడని ఆమె తెలిపారు.

Advertisements
బతికున్నంత కాలం రాజకీయ వారసుడిని

కుటుంబం కంటే పార్టీయే ముఖ్యమని వెల్లడి

లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ అఫీస్ బేరర్ల సమావేశంలో మాయావతి కీలక ప్రకటనలు చేశారు. తాను బతికున్నంత వరకూ పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండరని ఆమె స్పష్టం చేశారు. మార్చి 15న నిర్వహించనున్న పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. కాన్షీరామ్ సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తుందని చెప్పిన మాయావతి.. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని పేర్కొన్నారు. పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి బలహీన పరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను గత నెల పార్టీ నుంచి బహిష్కరించామని, ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్‌ను సైతం పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్లు వివరించారు.

Related Posts
సుంకాలు తగ్గించేందుకు భారత్ సుముఖం: ట్రంప్
కొత్త ఎలక్ట్రానిక్స్ సుంకాలు: తాత్కాలిక మినహాయింపులు

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికన్ ఉత్పత్తులపై అత్యధికంగా సుంకాలు వేసే దేశంగా భారత్‌ను అభివర్ణించే ట్రంప్.. Read more

కార్చిచ్చు రేగిన ప్రదేశంలో ట్రంప్ పర్యటన
Trump says he'll visit Cali

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రకృతి వైపరీత్యం తీవ్రతకు గురైన ప్రాంతాలను సందర్శించనున్నారు. కార్చిచ్చుతో భారీ నష్టాన్ని ఎదుర్కొన్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలిస్ ప్రాంతాన్ని Read more

ఏపీపీఎస్సీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా అనురాధ బాధ్య‌త‌ల‌ స్వీక‌రణ‌
anuradha

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో ఈ బాధ్యతలు Read more

Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్
Chhattisgarh in Encounter ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్

Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది Read more

×